క్యూఆర్ కోడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో జాగ్రత్త.. ఫేక్ క్యూఆర్ కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను స్కాన్ చేస్తే అంతే

క్యూఆర్ కోడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో జాగ్రత్త.. ఫేక్ క్యూఆర్ కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను స్కాన్ చేస్తే అంతే
  • పెరుగుతున్న సైబర్ మోసాలు..
  • తెలియని వారు పంపే క్యూఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు దూరంగా ఉండడం బెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

బిజినెస్ డెస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పే, గూగుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పే, పేటీఎం వంటి ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ పేమెంట్ కంపెనీలు వచ్చాక క్యూఆర్ కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల వాడకం విపరీతంగా పెరిగింది. కేవలం పేమెంట్ ట్రాన్సాక్షన్లకే కాదు వైఫై కనెక్ట్  చేసుకోవాలన్నా, కొత్త వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్లలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా క్యూఆర్ కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను స్కాన్ చేయడం ట్రెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారింది. దీంతో  క్యూఆర్ కోడ్ స్కామ్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి.  2017 నుంచి ఈ ఏడాది మే మధ్య ఒక్క బెంగళూరులోనే 20,662 క్యూఆర్ కోడ్ ఫ్రాడ్స్ రిజిస్టర్ అయ్యాయి.

 దేశం మొత్తం మీద ఇదే టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రిజిస్టర్ అయిన క్యూఆర్ కోడ్, డెబిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, క్రెడిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డ్ ఫ్రాడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మాలిషియస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లింక్ స్కామ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇటువంటి స్కామ్స్ వాటా 41 శాతంగా ఉంది.  పాలో ఆల్టో నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్స్ రిపోర్ట్ ప్రకారం, చాలా ఫేక్ క్యూఆర్ కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఒరిజినల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పోలినట్టే ఉంటున్నాయి. మోసగాళ్లు ఒరిజినల్ క్యూఆర్ కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను తీసేసి తమ క్యూఆర్ కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను రిప్లేస్ చేస్తున్నారు. ఇటువంటి కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను స్కాన్ చేయగానే  వెంటనే ఫిషింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యూఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు యూజర్లు  రీడైరెక్ట్ అవుతున్నారు.

సోషల్ మీడియా అకౌంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేదా ఈమెయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇతర పర్సనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డేటాను యూజర్ల నుంచి రాబడుతున్నారు. ఫేక్ క్యూఆర్ కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను స్కాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన  యూజర్లు ఫ్రాడ్‌‌‌‌ యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టోర్లకు రీడైరెక్ట్ అవుతున్నారు. కొన్ని యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్ చేసుకునేలా మోసగాళ్లు వీళ్లను ప్రలోభ పెడుతున్నారు. ఇటువంటి యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు  డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్ చేసుకుంటే యూజర్ల ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు హ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గురికావొచ్చు. 

ఈ యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో వైరస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, స్పైవేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ట్రోజాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేదా మాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఉండొచ్చు. పొరపాటున ఇటువంటి యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను యూజర్లు డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్ చేసుకుంటే వారి పర్సనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డేటా దొంగతనానికి గురవుతుంది. ర్యాన్సమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్ అటాక్స్ ఎదుర్కోవలసి వస్తుంది. 

ఫ్రీ వైఫై అంటూ ఆశ చూపి..

కొంత మంది సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నేరగాళ్లు ఫ్రీ వైఫై నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పెట్టి యూజర్లను ఆకర్షిస్తున్నారు. ఈ వైఫై నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కనెక్ట్ కావాలంటే యూజర్లు క్యూఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను స్కాన్ చేసేలా సెట్ చేస్తున్నారు. ఫ్రీ ఇంటర్నెట్ కనెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆశపడి క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే  యూజర్లు ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు హ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గురయ్యే అవకాశం ఎక్కువ. పర్సనల్ డేటా దొంగలించడం, ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ బ్యాంకింగ్ డిటైల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, క్రెడిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డు వివరాలను దొంగలించడం వంటివి మోసగాళ్లు చేస్తున్నారు. 

భద్రత ఇలా..

ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో క్యూఆర్ కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల బారిన పడకుండా ఉండొచ్చు. 

  • వీలున్నప్పుడల్లా అఫీషియల్ లేదా నమ్మకం ఉన్న యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లనే క్యూఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కాన్ చేయడానికి వాడాలి. ఇటువంటి యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో సెక్యూరిటీ ఫీచర్లు ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బిల్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉంటాయి. ఫేక్ క్యూఆర్ కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను స్కాన్ చేసినా మాలిషియస్ (ప్రమాదకరమైన) యాప్ స్టోర్లు, వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్లకు యూజర్లు రీడైరెక్ట్ కారు. 
  • క్యూఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను స్కాన్ చేసే ముందు వాటి సోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గురించి తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈమెయిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, టెక్స్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెసేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేదా సోషల్ మీడియా ద్వారా వచ్చిన క్యూఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను స్కాన్  చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. వీటిని ఎవరు పంపారో ముందు వెరిఫై చేసుకోవాలి. 
  • స్కాన్ చేసే ముందు  క్యూఆర్ కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను జాగ్రత్తగా గమనించాలి. క్యూఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు ఏమైనా టింకరింగ్ జరిగిందా? ఇవి డామేజ్ అయ్యాయా? చూసుకోవాలి. అనుమానాస్పదంగా ఉన్నవాటికి దూరంగా ఉండడం ఉత్తమమం.