దేశంలో మూడో అతిపెద్ద క్రిప్టో ట్రేడింగ్ ఎక్స్ఛేంజీ అయిన జియోటస్ దాదాపు 13 లక్షల మంది యూజర్లను కలిగి ఉంది. మారుతున్న పెట్టుబడుల సరళి, ఇన్వెస్టర్ల అభిరుచులకు అనుగుణంగా కంపెనీ వినూత్న ప్రయత్నంతో ముందుకొచ్చింది. కంపెనీ తెలుగు ఇన్వెస్టర్ల కోసం క్రిప్టో ఫ్యూచర్స్ ఎడ్యుకేషన్ ఫ్లాట్ ఫారం స్టార్ చేసి చరిత్ర సృష్టించింది. పైగా ఎలాంటి రుసుము చెల్లించకుండానే యూజర్లు ఇక్కడ జ్ఞానాన్ని పొందవచ్చని కంపెనీ చెబుతోంది.
ప్రస్తుతం కంపెనీ ఈ ఎడ్యుకేషన్ సేవలను ఇంగ్లీషుతో పాటు తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ వంటి 5 ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ జియోటస్ అకాడమీ రియల్ టైం పరిజ్ఞానంతో ఇన్వెస్టర్లను ఎడ్యుకేట్ చేయాలని నిర్ణయించింది. కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకుని రిజిస్ట్రేషన్ అయిన ట్రేడర్లకు అడ్వాన్స్ క్రిప్టో ట్రేడింగ్, రిస్క్ మేనేజ్మెంట్ నేర్పించనున్నట్లు కంపెనీ చెబుతోంది.
ALSO READ : భారత ఆటో రంగాన్ని శాసించిన ఏకైక మారుతీ కార్..
ఇక్కడ ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు అన్నింటిపై అవగాహన కలిగించటంతో పాటు ఏఐ ద్వారా ఎలా ట్రేడింగ్ చేయాలో కూడా వివరిస్తారు. గడచిన కొన్ని నెలలుగా క్రిప్టోలు ప్రపంచ వ్యాప్తంగా రాబడులతో సునామీ సృష్టిస్తున్న సమయంలో కంపెనీ వినూత్న ఆలోచనతో ముందుకు రావటం ఆశ్చర్యానికి కలిగిస్తోంది. తమ ప్రయత్నం ద్వారా పెట్టుబడిదారులకు సరైన మార్గంలో జ్ఞానాన్ని ఇవ్వటం మంచి రాబడులు పొందేందుకు తోడ్పాటుగా నిలవాలని అనుకుంటున్నట్లు జియోటస్ సీఈవో విక్రమ్ సుబ్బురాజ్ చెప్పారు. అందుకే విలువైన వివరాలను ప్రాంతీయ భాషల్లోని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. తర్వాతి తరం ట్రేడర్లకు ఇది శక్తివంతం మార్చుతుందని అన్నారు. https://giottusacademy.com/sessions ద్వారా దీనికి సంబంధించిన వివరాలు పొందవచ్చు.
