ప్రేమజంటను వేధించిన కేసులో ఉప్పల్ సీఐపై బదిలీ వేటు

ప్రేమజంటను వేధించిన కేసులో ఉప్పల్ సీఐపై బదిలీ వేటు

ఉప్పల్ సీఐపై బదిలీ వేటు పడింది. ఉప్పల్ భగాయత్ లో ఓ ప్రేమజంటను వేధించిన కేసులో  నిందితులపై పీటి కేసు నమోదు చేసి డబ్బులు డిమాండ్ చేశారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు.. ఎస్ఐ శంకర్ ను డీసీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. ఈ కేసులో నిర్లక్ష్యం వహించిన ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డిపై బదిలీ వేటు వేశారు. ఆయనను సీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు.

అలాగే.. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని నాగోల్ ఇన్స్పెక్టర్ పరుశురాంపై బదిలీ వేటు పడింది. మరో ఇద్దరిని సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయకుండా బాధితుడిని బెదిరించారని ఆరోపనలు రావడంతో  ఇన్స్పెక్టర్ పై బదిలీ చేసినట్లు ఎల్బీ నగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్ తెలిపారు. బదిలీలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.