
ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సోదరుడు, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి (78) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజిరెడ్డి మే 8న తెల్లవారుజామున హబ్సిగూడలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
పలువురు కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు రాజిరెడ్డి మృతికి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మే 9న రాజిరెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి. హబ్సిగూడ నుంచి అంతిమ యాత్ర ప్రారంభం కానుందని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
బండారి రాజిరెడ్డి 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఉప్పల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై గెలుపొందారు. 2014లో ఆయన సోదరుడు బండారి లక్ష్మారెడ్డి ఉప్పల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతర లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ లో చేరి 2023లో ఎమ్మెల్యేగా గెలిచారు.
ఈరోజు ఉదయం మా అన్నగారు ఉప్పల్ మాజీ శాసనసభ్యులు శ్రీ బండారి రాజిరెడ్డి గారు అనారోగ్య కారణం వలన మరణించడం జరిగింది అని తెలియజేయుటకు చింతిస్తున్నాం. వారి పార్థివ దేహమును హబ్సిగూడ నివాసం నందు సందర్శనార్థం ఉంచడం జరిగినది.
— Bandari Lakshma Reddy (@BrsBandari) May 8, 2025
మీ
బండారి లక్ష్మారెడ్డి
శాసనసభ్యులు ఉప్పల్ pic.twitter.com/BZHKHRELy8