ప్రతి ఒక్కరూ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్ విఎస్ఎస్ ప్రభాకర్ తెలిపారు. భారత ప్రధాని నరేంద్రమోదీ పిలుపుమేరకు ప్రతీ భారతీయులంతా రేపు(ఆగస్టు 15) జాతీయ జండాను ఎగురవేయాలని మాజీ ఎమ్మెల్యే ఎన్ విఎస్ఎస్ ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా హైదరాబాద్ ఉప్పల్ నియోజకవర్గంలో బీజేపీ నాయకులతో కలసి మాజీ ఎమ్మెల్యే ఎన్ విఎస్ఎస్ ప్రభాకర్ బైక్ పై తిరంగ యాత్ర నిర్వహించారు.
స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు దాటిన సందర్భంగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు.. కుల, మత, జాతి భేదం లేకుండా భారతీయులంతా ఒక్కటై ఈ పండగను జరుపుకోవాలన్నారు. అదేవింధంగా ఆనాటి స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకోవాలని చెప్పారు. దేశ సమైక్యత, సమగ్రతకు భంగం కలిగించే వ్యక్తులు, సంస్థల పట్ల కఠినంగా ఉండాలనే విషయాన్ని తెలిపారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తులను ఏరిపారేయాలని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ వివరించారు.