చైన్ స్నాచింగ్.. దొరికిన దొంగ

చైన్ స్నాచింగ్.. దొరికిన దొంగ

ఉప్పల్, వెలుగు: చైన్​ స్నాచింగ్​కు పాల్పడిన ఓ దొంగను స్థానికులు పట్టుకుని చితకబాది  పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. శుక్రవారం బోడుప్పల్​కు చెందిన జానకీ(65) సెవెన్ హిల్స్ కాలనీలో వాకింగ్  చేస్తోంది. 

ఈ క్రమంలో యాదాద్రి భువనగిరి  జిల్లా వలిగొండ మండలం దాసిరెడ్డిగూడేనికి చెందిన రాపోలు మహేశ్​ ఆమె మెడిలో ఉన్న 4 తులాల గోల్డ్ చైన్ లాక్కుని పారిపోయేందుకు ప్రయత్నించాడు. బాధితురాలు పెద్దగా కేకలు వేయడంతో అప్రమత్తమైన స్థానికులు వెంబడించి దొంగను పట్టుకున్నారు. దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసునమోదు చేశారు.