ఆర్టీసీ బస్సుల్లో జేబు దొంగలు.. ఐదుగురు అరెస్ట్

ఆర్టీసీ బస్సుల్లో జేబు దొంగలు.. ఐదుగురు అరెస్ట్

ఉప్పల్, వెలుగు: ఆర్టీసీ బస్సుల్లో పిక్​పాకెట్​కు పాల్పడుతున్న పలువురిని ఉప్పల్​ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నవంబర్​ 1న జనగామ జిల్లాకు చెందిన వ్యాపారి సేన రామ్​ సికింద్రాబాద్​ నుంచి ఆభరణాలు, నగలు తీసుకుని ఆర్టీసీ బస్సులో బయల్దేరి ఉప్పల్​లో దిగాడు. బ్యాగులో ఆభరణాలు కనిపించకపోవడంతో ఉప్పల్​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

దర్యాప్తు చేపట్టిన పోలీసులు హైదరాబాద్​కు చెందిన దాసర్ల యాదగిరి(24),  కొమ్ము ప్రశాంత్​(25), పాసం యాదగిరి(23), బండారి సాంబరాజు(25), మబ్బు రాజు(25) చోరీలు చేస్తున్నట్లుగా గుర్తించారు. వీరిని అరెస్టు చేసి 5 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రిమాండ్​కు తరలించారు.