తాగి న్యూసెన్స్ చేసిండని..మొక్కలకు నీళ్లు పోయించారు

తాగి న్యూసెన్స్ చేసిండని..మొక్కలకు నీళ్లు పోయించారు

ఉప్పల్, వెలుగు : నడిరోడ్డుపై న్యూసెన్స్ చేసిన వ్యక్తికి ఉప్పల్ పోలీసులు వినూత్న రీతిలో పనిష్మెంట్​ ఇచ్చారు. ఉప్పల్​ భరత్​నగర్‌‌‌‌కు చెందిన చిందం బాలమల్లేశ్(39) ఈనెల14న ఫుల్లుగా మద్యం తాగి ఉప్పల్ చౌరస్తాలో గొడవ చేశాడు. అడ్డుకున్న పోలీసులపై తిరబడ్డాడు. పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి పనిష్మెంట్ కింద 3రోజుల పాటు పీఎస్​లో స్వచ్ఛభారత్​చేయాలని చెప్పారు. అందులో భాగంగా నిందితుడు గురువారం ఇలా పీఎస్​లో మొక్కలకు నీళ్లు పడుతూ కనిపించాడు.