'ఊర్వశివో రాక్షసివో' సెలబ్రేషన్స్ ముఖ్య అతిథిగా అల్లు అర్జున్

'ఊర్వశివో రాక్షసివో' సెలబ్రేషన్స్ ముఖ్య అతిథిగా అల్లు అర్జున్

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ ‘అల్లు అర్జున్’ సోదరుడు ‘అల్లు శిరీష్’ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘ఊర్వశివో రాక్షసివో’ ఇటీవలే విడుదలై మంచి మార్కులు సంపాదించింది. ఇందులో హీరోయిన్ గా అనూ ఇమ్మాన్యుయేల్ నటించింది. రాకేశ్ శశి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ రొమాంటిక్, కామెడీ జోనర్లో తెరకెక్కింది. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా నిలిచిన ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకోవడంతో సెలబ్రేషన్స్ నిర్వహించాలని చిత్ర బృందం నిర్ణయించింది. అందులో భాగంగా ‘యూత్ ఫుల్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్' పేరిట ఆదివారం ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. జేఆర్సీ కన్వెషన్ వేదికగా జరిగే ఈ సెలబ్రేషన్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నటుడు ‘అల్లు అర్జున్’ హాజరవుతున్నట్లు గీతా ఆర్ట్స్ వెల్లడించింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేసింది. 

ఈ మూవీలో శ్రీకుమార్‌‌‌‌గా అల్లు శిరీష్, సింధుగా అనూ ఇమ్మాన్యుయేల్ కనిపించారు. ఇద్దరూ సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తుంటారు. ఇంట్లో అమాయకంగా ఉండే శిరీష్, బయట మాత్రం అనుతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటాడు. వెన్నెల కిశోర్, సునీల్‌‌ కీలక పాత్రల్లో కనిపించారు. అచ్చు రాజమణి, అనూప్ రూబెన్స్ కలిసి ఈ చిత్రానికి సంగీతం అందించారు.