బయోవెపన్స్తో అమెరికాను నాశనం చేయాలనుకున్నారా..? యూఎస్లో మరో చైనా సైంటిస్ట్ అరెస్ట్

బయోవెపన్స్తో అమెరికాను నాశనం చేయాలనుకున్నారా..?  యూఎస్లో మరో చైనా సైంటిస్ట్ అరెస్ట్

ఒకవైపు అమెరికా టారిఫ్ లతో చైనాను టార్గెట్ చేస్తుంటే.. చైనా సైంటిస్టులు మాత్రం బయోవెపన్ లతో యూఎస్ ను టార్గెట్ చేయాలని భావిస్తున్నట్లుంది.   యూఎస్ లోకి విషపూరిత ఫంగస్‌ను అక్రమంగా రవాణా చేస్తూ ఇద్దరు చైనా శాస్త్రవేత్తలు పట్టుబడిన వారం రోజుల వ్యవధిలోనే మరో సైంటిస్ట్ బయోలాజికల్ మెటీరియల్ ను తీసుకొస్తూ పట్టుబడటం అమెరికా అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది.  వరుసగా జీవసంబంధిత పదార్థాలను అమెరికాలోకి రవాణా చేస్తూ పట్టుబడుతుండటంతో అమెరికా అధికారులు ఈ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

సోమవారం (జూన్ 9) చైనా  వుహాన్‌లోని హువాజోంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కి చెందిన సైంటిస్టు చెంగ్క్సువాన్ హాన్‌ను డెట్రాయిట్ మెట్రోపాలిటన్ ఎయిర్ పోర్ట్ లో FBI అదుపులోకి తీసుకుంది. 
కొన్ని పురుగులు, సూక్షక్రిములకు సంబంధించిన జీవసంబంధ పదార్థాలను అమెరికాలోకి అక్రమంగా రవాణా చేశాడని అతన్ని అరెస్టు చేశారు.ఆ పదార్థాల గురించి అడిగినప్పుడు తప్పుడు సమాచారం అందించాడనే ఆరోపణలతో అరెస్టు చేసి విచారిస్తున్నారు. 

జీవసంబంధమైన పదార్థాలను రవాణా చేశాడని శాస్త్రవేత్తపై ఆరోపణలు
రౌండ్‌వార్మ్‌కు సంబంధించిన బయోలాజికల్ పదార్థా ఉన్న నాలుగు ప్యాకెట్ లను హాన్ చైనా నుండి అమెరికాకు పంపినట్లు ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు అధికారులు. ఈ ప్యాకేజీలు మిచిగాన్ యూనివర్సిటీలోని ల్యాబ్ కు చెందిన వ్యక్తులకు పంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

 మిచిగాన్ యూనివిర్టీలో రీసెర్చ్ ల్యాబ్ కు పంపించిన బయోవెపన్ .. కొన్ని మైక్రో ఆర్గాన్స్ కు సంబంధించిన పదార్థంగా ఎఫ్బీఐ కోర్టు నిర్ధారించింది. ఇలాంటి పదార్థాలు తీసుకురావాలంటే ప్రభుత్వ అనుమతి అవసరమని పేర్కొంది. ప్రస్తుతం వుహాన్‌లోని హువాజోంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో అడ్వాన్స్‌డ్ డిగ్రీ చదువుతున్న చైనా సైంటిస్ట్..  ఒక ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి ఒక ఒక సంవత్సర కాలం ప్లాన్ చేసుకుని యూఎస్ వచ్చినట్లు విచారణలో తేలింది. 

" డెట్రాయిట్‌లో యుఎస్‌లోకి బయోలాజికల్ మెటీరియల్‌లను అక్రమంగా రవాణా చేస్తున్నందుకు చైనా వ్యక్తిని అరెస్టు చేసినట్లు FBI డైరెక్టర్ కాష్ పటేల్ X లో పేర్కొన్నారు.  చైనాలోని వుహాన్‌లో పిహెచ్‌డి చేస్తున్నట్లుగా ఈ సందర్భంగా తెలిపారు. 

అమెరికాను టార్గెట్ చేసి చైనా సైంటిస్టులు ప్రమాదకరమైన జీవ పదార్థాలను స్మగ్లింగ్ చేస్తున్నారని US న్యాయవాది జెరోమ్ గోర్గాన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. స్మగ్లింగ్ కారణంగా తమ భద్రతకు ముప్పు వాటిల్లిందని ఆందోళన వ్యక్తం చేశారు.  చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ (CCP)తో సంబంధాలున్న వ్యక్తులు అమెరికా పరిశోధనా సంస్థలను అణగదొక్కడానికి కృషి చేస్తున్నాయని ఈ సందర్భంగా ఆమె ఆరోపించారు.