
"తాడిని తన్నేవాడుంటే వాడి తల తన్నేవాడుంటాడు" అని తెలుగులో ఒక సామెత ఉంది. అంటే ఎంతటి బలవంతుడినైనా ఓడించేవాడు తప్పక ఉంటాడని దీనికి అర్థం. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విషయంలోనూ అదే రిపీట్ అవుతోంది. అమెరికా అధ్యక్షుడు అంటే ప్రపంచ పెద్దన్నగా.. అందరికంటే శక్తివంతుడిగా భావిస్తుంటారు. దీంతో తన శక్తిని ఉపయోగించి ప్రపంచ దేశాలపై టారిఫ్స్ విధించటం నుంచి విదేశీయులకు వీసాలను కఠినతరం చేయటం, ఫారెన్ ఉద్యోగులకు హెచ్1బి వీసా కావాలంటే లక్ష డాలర్లు కట్టాల్సిందే అంటూ కొత్త నిబంధనలు తెచ్చారు ట్రంప్.
అయితే ఈ సమస్యను అధిగమించేందుకు అనేక అమెరికన్ కంపెనీలు కొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నాయి. వివరాల్లోకి వెళితే చాలా అమెరికా సంస్థలు హెచ్1బి వీసాల కఠినతరం తర్వాత తమ వ్యాపారంలోని క్రిటికల్ వర్క్ భారతదేశానికి షిఫ్ట్ చేస్తున్నారు. దీంతో గ్లోబల్ క్యాపబిటిలీ సెంటర్లు తమ ఆపరేషన్స్ ఇండియాలో పెంచుతున్నాయి. ఈ సంస్థలు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ నుంచి ఫైనాన్స్ వరకు ఇండియాకు తరలిస్తున్నట్లు ఆర్థిక వేత్తలు, పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం భారతదేశంలో దాదాపు 1700 జీసీసీలు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. దీంతో ఫార్మా నుంచి ఆటో వరకు అనేక కంపెనీలు తమ పనిని భారతదేశానికి మార్చటం ఇక్కడి టాలెంట్ అమెరికా ఇచ్చే హెచ్1బి వీసాల కోసం కష్టపడటం తగ్గుతుందని తెలుస్తోంది. మరోపక్క ఏఐ కొత్త పుంతలు తొక్కటం నుంచి వీసా రూల్స్ మార్పులను అమెరికా సంస్థలు తెలివిగా అధిగమిస్తూ కొత్త లేబర్ స్ట్రాటజీ దిశగా పయనిస్తున్నాయని తెలుస్తోంది.
ఈ మెగా షిఫ్ట్ కోసం అవసరమైన వ్యూహాత్మక మార్పుల కోసం అమెరికా సంస్థలు ప్లాన్స్ స్పీడప్ చేశాయి. జీసీసీ పరిశ్రమలో భారతదేశంలో డెలాయిట్ లీడర్ గా కొనసాగుతోంది. అయితే జీసీసీలు వెంటనే పని స్టార్ట్ చేయటానికి వీలుగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ అధ్యక్ష గడువు ముగిసే వరకు అమెరికా టెక్ దిగ్గాజాలైన అమెజాన్, ఆపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్.. అలాగే బ్యాంకింగ్ కంపెనీలు జేపీ మోర్గన్ నుంచి వాల్ మార్ట్ వరకు ఇదే తరహా హ్యూహాలతో తమ లేబర్ షార్టేజ్ సమస్యలను హెచ్1బి వీసాల వల్ల ఎఫెక్ట్ అవ్వకుండా ముందుకు సాగటం దేశీయంగా కొత్త ఉద్యోగ అవకాశాలు టాలెంట్ పూల్ కి అందుబాటులోకి వస్తాయని నిపుణులు చెబుతున్నారు.