ఇండియాకు సాయంగా నిలుస్తున్న యూఎస్ కంపెనీలు

ఇండియాకు సాయంగా నిలుస్తున్న యూఎస్ కంపెనీలు
  •     25 వేల ఆక్సిజన్ మెషీన్లను అందిస్తాం
  •     మందులు, ఇతర ఎక్విప్‌‌‌‌మెంట్లు కూడా పంపుతాం
  •     డెలాయిట్ సీఈవో పునీత్ రంజన్ 

వాషింగ్టన్: కరోనా మహమ్మారి ధాటికి విలవిల్లాడుతున్నమన దేశానికి  సాయం చేయడం కోసం అమెరికాకు చెందిన 40 ప్రముఖ కంపెనీల సీఈవోలు  ముందుకు వచ్చారు. ఇందుకోసం గ్లోబల్ టాస్క్ ఫోర్స్​ను ఏర్పాటు చేయాలని,  ఈ టాస్క్ ఫోర్స్ ద్వారా వచ్చే కొన్ని వారాల్లో 25 వేల ఆక్సిజన్ తయారీ  మెషీన్లు (ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు) అందజేయాలని నిర్ణయించారు. కరోనాపై  పోరులో ఒక దేశానికి సాయం చేయడం కోసం ప్రత్యేకంగా గ్లోబల్ టాస్క్  ఫోర్స్​ను ఏర్పాటు చేయనుండటం ఇదే తొలిసారి. 

ఇండియాకు సాయం చేసేందుకు ‘గ్లోబల్ టాస్క్ ఫోర్స్ ఆన్ ప్యాండెమిక్  రెస్పాన్స్: మొబిలైజింగ్ ఫర్ ఇండియా’ను ఏర్పాటు చేయాలని సోమవారం  నిర్ణయించినట్లు డెలాయిట్ కంపెనీ సీఈవో పునీత్ రంజన్ వెల్లడించారు. టాస్క్ ఫోర్స్ లో యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలోని యూఎస్-  ఇండియా బిజినెస్ కౌన్సిల్, యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ అండ్ పార్టనర్​షిప్  ఫోరం, బిజినెస్ రౌండ్ టేబుల్ సంస్థలు కీలక పాత్ర పోషించనున్నాయని  తెలిపారు. ఆక్సిజన్ మెషీన్లతో పాటు కీలకమైన రెండు మందులు,  మానిటరింగ్ కిట్లు, వ్యాక్సిన్ తయారీకి అవసరమైన మెటీరియల్, ఎక్విప్​ మెంట్లను అందజేయనున్నట్లు వెల్లడించారు. 

అవసరమైతే మరిన్ని.. 
ఈ వారంలోనే ముందుగా 1,000 ఆక్సిజన్ మెషీన్లను పంపుతామని, మే 5  నాటికి 11 వేల మెషీన్లు ఇండియాకు చేరుతాయని పునీత్ తెలిపారు. ముందుగా 25 వేల మెషీన్లు అందజేయాలని నిర్ణయించామని, అవసరమైతే  మరిన్ని మెషీన్లను కూడా పంపుతామన్నారు. అలాగే 10, 45 లీటర్ల  కెపాసిటీ ఉన్న ఆక్సిజన్ సిలిండర్లను కూడా అందజేస్తామన్నారు. హర్యానాలోని రోహ్​తక్​కు చెందిన పునీత్ రంజన్ కూడా కరోనా బారిన పడ్డారు. ఒక్క ఇండియాలోనే తమ కంపెనీకి చెందిన 2 వేల మంది  ఉద్యోగులు కరోనా బారిన పడ్డారని, ఈ కష్టకాలంలో ఇండియాకు అన్ని  రకాలుగా సాయం చేయడానికి సిద్ధంగా ఉని చెప్పారు. ఇండియాకు సాయం విషయంలో ప్రధాని మోడీ, అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ మధ్య కూడా చర్చలు  జరిగాయన్నారు.

టెలిమెడిసిన్‌‌‌‌ హెల్ప్‌‌‌‌లైన్ మొదలు
కరోనా పేషెంట్లకు సహాయం చేయడానికి ఇండియన్-అమెరికన్‌‌‌‌ డాక్టర్ల టీమ్‌‌‌‌  టెలిమెడిసిన్ హెల్ప్‌‌‌‌లైన్‌‌‌‌  స్టార్ట్ చేసింది. బీహార్, జార్ఖండ్‌‌‌‌కు చెందిన డాక్టర్లు,  మరికొంత మందితో కలిసి.. కరోనా పాజిటివ్ వచ్చిన వారికి ఫ్రీగా సేవలందిం  చడానికి హెల్ప్‌‌‌‌లైన్‌‌‌‌ ప్రారంభించారు. ఇండియన్-అమెరికన్ డాక్టర్లతో కలిసి  బీహార్, జార్ఖండ్ అసోసియేషన్ ఆఫ్‌‌‌‌ నార్త్ అమెరికా(బీజేఏఎన్‌‌‌‌ఏ) ప్రెసిడెంట్‌‌‌‌  డాక్టర్ అవినాశ్‌‌‌‌ గుప్తా నేతృత్వంలో ఈ సేవలను అందిస్తున్నారు. కరోనా  నుంచి కోలుకుని ప్రజలు మామూలు పరిస్థితికి రావడానికి తాము తీసుకునే  చర్యల్లో ఇది కూడా ఒకటి అని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్  మాజీ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ చెప్పా రు.  పదుల సంఖ్యలో డాక్టర్లు  టెలిమెడిసిన్​ హెల్ప్‌‌‌‌లైన్ ద్వారా కరోనా పేషెంట్లకు హెల్ప్ చేస్తారన్నారు.  అవగాహన లోపమే కరోనా పేషెంట్లకు పెద్ద సమస్యగా గుర్తించామని తెలిపారు.  దీనికోసం బీజేఏఎన్‌‌‌‌ఏ జూమ్ సెషన్స్ నిర్వహిస్తోందని, పాట్నాకు మెడికల్‌‌‌‌  పరికరాలను సప్లై చేయడానికి కృషి చేస్తోందని అలోక్‌‌‌‌ కుమార్ తెలిపారు.

ఐర్లాండ్ ఆక్సిజన్ సాయం
మన దేశానికి సాయం చేసేందుకు ఐర్లాండ్ ముందుకొచ్చింది. ఆక్సిజన్​ కాన్సంట్రేటర్లను పంపించింది. ‘‘ఇండియాకు 700 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను  మా దేశం పంపిస్తోంది. అవి బుధవారం ఉదయం వరకు వస్తాయి” అని ఐర్లాండ్ ఎంబసీ మంగళవారం పేర్కొం ది. ‘‘ఐర్లాండ్​కు ఇండియాతో మంచి  సంబం ధాలు ఉన్నాయి. ఈ కష్టకాలంలో ఇండియా కు మరింత సాయం  చేయాలని ఆలోచిస్తు న్నాం. వెంటిలేటర్లు, ఇతర మెడికల్ ఎక్విప్ మెంట్ కూడా అందించాలని అనుకుంటున్నాం” అని ఐర్లాండ్ అంబాసిడర్ బ్రెండెన్  వార్డ్ తెలిపారు.

మేమూ హెల్ప్ చేస్తాం: కాలిఫోర్నియా గవర్నర్
ఇండియాలో కరోనా వ్యాప్తి, ఆక్సిజన్ కొర త తీవ్రం అవుతుండటంతో తాము  కూడా హెల్ప్ చేస్తామంటూ కాలిఫోర్నియా స్టేట్ గవర్నర్ గవిన్ న్యూసమ్  చెప్పారు. కాలిఫోర్నియాలో ఇండియన్లు ఎక్కువని ఆయన చెప్పారు. 275  ఆక్సిజన్ మెషీన్లు, 440 సిలిండర్లు, 240 రెగ్యులేటర్లు, 210 పల్స్  ఆక్సిమీటర్లు, నిమిషానికి 120 లీటర్ల ఆక్సిజన్​ను ఉత్పత్తి చేసే ఒక  డిప్లాయెబుల్ ఆక్సిజన్ కాన్సెంట్రేటర్​ సిస్టమ్​ను విరాళంగా పంపిస్తామని తెలిపారు.

2 వేల మంది ఎక్స్​పర్ట్స్ ను పంపిస్తం: డబ్ల్యూహెచ్ఓ చీఫ్
ఇండియా కరోనా పరిస్థితి కలిచి వేసిందని డబ్ల్యూ హెచ్ఓ చీఫ్ టెడ్రోస్  అధనమ్ గెబ్రె యెసస్ అన్నారు. సెకండ్ వేవ్​లో రికార్డు స్థాయిలో కేసులు,  మరణాలు నమోదవుతున్నాయని చెప్పారు. కరోనా పేషెంట్లతో హాస్పిటళ్లు, కరోనా మృతులతో శ్మశానవాటిక లు నిండిపోయాయన్నారు. ఈ క్రైసిస్  టైమ్​లో ఇండియాకు అన్ని విధాలా సాయం అందిస్తామని తెలి పారు. వేలాది  ఆక్సిజన్ కాన్సంట్రేట ర్స్, మొబైల్ హాస్పిటళ్లు, ల్యాబొరేట రీ సప్లయ్స్, క్రిటికల్  ఎక్విప్​మెంట్స్ ను పంపిస్తున్నామన్నారు. డబ్ల్యూ హెచ్ఓ నుంచి 2,600  మంది ఎక్స్ పర్ట్​లను కూడా ఇండియాకు పంపిస్తామన్నారు.

8 ఆక్సిజన్ జనరేటర్లు పంపిస్తం: ఫ్రాన్స్ అధ్యక్షుడు 
సెకండ్ వేవ్‌‌‌‌తో అతలాకుతలమవుతున్న ఇండియాకు అండగా నిలుస్తామని  ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మెక్రాన్ ప్రకటించారు. 8 ఆక్సిజన్  జనరేటర్లు, 5 కంటెయినర్ల లిక్విడ్ ఆక్సిజన్,28 వెంటిలేటర్లు,200 వరకు ఎలక్ట్రిక్‌‌‌‌ సిరెంజ్ పంపులు మన దేశానికి పంపుతున్నట్టు మెక్రాన్ ట్విట్టర్‌‌‌‌‌‌‌‌లో  వెల్లడించారు. 250 బెడ్స్ ఉన్న హాస్పిటల్‌‌‌‌కు పది సంవత్సరాల వరకు  ఆక్సిజన్ సరఫరా చేసే కెపాసిటీ చొప్పున కలిగి ఉన్న 8 ఆక్సిజన్ జనరేటర్లను పంపిస్తున్నామన్నారు. మొదటి విడతలో పంపిస్తున్న 5  కంటెయినర్లలో ఒక్కోదాంట్లోని లిక్విడ్ ఆక్సిజన్‌‌‌‌తో సుమారు పదివేల మంది  పేషెంట్లకు ఒక రోజుకు సరిపడా ఆక్సిజన్‌‌‌‌ను అందించవచ్చని చెప్పారు. వీటితో  ఇండియాలోని హాస్పిటల్స్ కెపాసిటీ పెరుగుతుందని మెక్రాన్ చెప్పారు.  ‘సాలిడారిటీ మిషన్’ పేరుతో వాయు, సముద్ర మార్గం ద్వారా వీటిని  పంపనున్నట్టు ఫ్రాన్స్‌‌‌‌ ప్రభుత్వం తెలిపింది.