చైనా అకృత్యాలను అరికట్టేందుకు ఒత్తిడి

చైనా అకృత్యాలను అరికట్టేందుకు ఒత్తిడి

వాషింగ్టన్: వీగర్ ముస్లిం కమ్యూనిటీపై చైనా అకృత్యాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆ దేశంపై అమెరికా రకరకాల మార్గాల్లో ఒత్తిడి పెంచుతోంది. వాయువ్య చైనాలోని జిన్ జియాంగ్ ప్రావిన్స్ నుంచి అన్ని రకాల దిగుమతులపైనా నిషేధం విధిస్తూ యూఎస్ సెనేట్ గురువారం ఏకగ్రీవ నిర్ణయం తీసు కుంది. జిన్ జియాంగ్​లో వీగర్లపై చైనా హేయమైన సామూహిక జనహననానికి పాల్పడుతోందని సెనేటర్ మార్కో రుబినో దుయ్యబట్టారు. ఇస్లాంను వదులుకోవాలంటూ వీగర్లపై చైనా నానా అకృత్యాలకు పాల్పడుతోందని, లక్షలాది మందిని జైళ్లు, క్యాంపుల్లో బంధించిందని కొన్నేళ్లుగా అంతర్జాతీయ సమాజం గగ్గోలు పెడుతున్న విషయం తెలిసిందే. ఇందుకు నిరసనగా ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడాతో కలిసి వచ్చే ఏడాది బీజింగ్ జరిగే వింటర్ ఒలింపిక్స్ ను బహిష్కరించాలని కూడా అమెరికా యోచిస్తోంది.