టారిఫ్లతో వసూలు చేసిన 130 బిలియన్ డాలర్లు చెల్లించండి.. కస్టమ్స్ డిపార్ట్మెంట్కు యూఎస్ కోర్టు ఆదేశం

టారిఫ్లతో వసూలు చేసిన  130 బిలియన్  డాలర్లు చెల్లించండి.. కస్టమ్స్ డిపార్ట్మెంట్కు యూఎస్ కోర్టు ఆదేశం

వాషింగ్టన్: దిగుమతిదారుల నుంచి అక్రమంగా వసూలు చేసిన 130 బిలియన్  డాలర్ల (రూ.12 లక్షల కోట్లు) ట్రంప్  ఇల్లీగల్  టారిఫ్ లను తిరిగి ఇంపోర్టర్లకు చెల్లించాలని అమెరికా కస్టమ్స్  డిపార్ట్ మెంట్ ను యూఎస్  ట్రేడ్  కోర్టు ఆదేశించింది. ఆ టారిఫ్ లను అక్రమంగా వసూలు చేశారని గత నెలలో సుప్రీంకోర్టు పేర్కొందని ట్రేడ్ కోర్టు తెలిపింది. 

దేశంలోకి దిగుమతి చేయడానికి అయిన ఖర్చును టారిఫ్​లను అంచనా వేయకుండా తేల్చాలని మాన్ హటన్ లోని యూఎస్  కోర్ట్  ఆఫ్​ ఇంటర్నేషనల్  ట్రేడ్  కోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ‘‘దేశంలోకి సరుకు తెచ్చినపుడు, అంచనా వేసిన అమౌంట్ ను ఎంట్రీ వద్దే ఇంపోర్టర్  చెల్లిస్తాడు. 314 రోజుల తర్వాత ఆ అమౌంట్ ను లిక్విడేషన్  ప్రక్రియ ద్వారా ఫైనలైజ్  చేస్తారు. 

టారిఫ్​లను అంచనా వేయకుండా షిప్ మెంట్లపై అయిన వ్యయాన్ని ఖరారు చేయాలని కస్టమ్స్  అండ్  బార్డర్  ప్రొటెక్షన్ ను ఆదేశిస్తున్నాం” అని తెలిపింది. అంచనా వేసిన దాని కన్నా ఎక్కువగా చెల్లించిన దిగుమతుదారులకు రిఫండ్లు తిరిగి చెల్లించడానికి ఒక చానెల్ ను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. 
కోర్టు ఆదేశాలను సవాలు చేస్తాం

 

దిగుమతిదారులకు టారిఫ్ లు చెల్లించాలని యూఎస్ ట్రేడ్  కోర్టు ఇచ్చిన ఆదేశాలపై సవాలు చేస్తామని కస్టమ్స్  శాఖ అధికారులు తెలిపారు. కాగా.. ఆట్మస్  ఫిల్ట్రేషన్  ఏటీఎంయూ.ఎన్  అనే సంస్థ వేసిన పిటిషన్ పై యూఎస్  ట్రేడ్  కోర్టు విచారణ చేపట్టి టారిఫ్ లు చెల్లించాలని అమెరికా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

 తమ నుంచి కస్టమ్స్  డిపార్ట్ మెంట్ 11 మిలియన్లను (రూ.100 కోట్లు) ఇల్లీగల్ గా వసూలు చేసిందని ఆట్మస్  ఫిల్ట్రేషన్  కోర్టుకు వెల్లడించింది. అలాగే, ఆట్మస్ తో పాటు పలు కంపెనీలు కూడా యూఎస్  ట్రేడ్  కోర్టులో కేసు వేశాయి. కస్టమ్స్ అధికారులు తమ నుంచి అక్రమంగా టారిఫ్ లు వసూలు చేశారని దావాలో పేర్కొన్నాయి.