షారుక్ పాటకు అమెరికన్ జంట స్టెప్పులు 

V6 Velugu Posted on Aug 31, 2021

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ సూపర్ హిట్ సాంగ్ ‘చమ్మక్ చల్లో’ పాటకు అమెరికన్ వృద్ధ జంట స్టెప్పులేసి అదరగొట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్‌ మీడియాలో "డ్యాన్సింగ్ డాడ్" గా పిలువబడే రికీ పాండ్ తన 25వ పెళ్లి రోజు సందర్భంగా బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నటించిన రావణ్ సినిమాలోని చమ్మక్ చలో పాటకు తన భార్యతో కలసి  స్టెప్పులేసి అదరగొట్టాడు.  
హాలీవుడ్ తోపాటు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ సినిమాల్లో సూపర్ హిట్ అయిన పాటలకు స్టెప్పులేసి సోషల్ మీడియాలో షేర్ చేయడం రికీ పాండ్ కు అలవాటు. తన భార్యా పిల్లలతో వీలు చిక్కినప్పుడల్లా ఇలాంటి సరదా వీడియోలు చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు. లేటు వయసులో కూడా ఆయన సరదా డ్యాన్సులు చూసి నెటిజన్లు ఆయనకు ‘డ్యాన్సింగ్ డ్యాడ్’ అనే ముద్దుపేరు పెట్టేశారు. 
 గతంలో షారుక్ ఖాన్ సూపర్ హిట్ పాట చెయ్య చెయ్య చెయ్యాకు స్టెప్పులేసి అలరించిన ఆయన  అల్లుఅర్జున్ బుట్టబొమ్మ పాటకు కూడా స్టెప్పులేసి మన తెలుగువారిని అలరింపచేసిన విషయం నెటిజనులకు తెలిసిందే. తాజాగా తన పెళ్లి రోజు సందర్భంగా  ఈ అమెరికన్‌ జంట మళ్లీ షారుక్ పాట చమ్మక్ చల్లోకు వేసిన డ్యాన్సుల వీడియో  ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

తన 25వ పెళ్లిరోజు సందర్భంగా  రీకీపాండ్ తన భార్యతో కలిసి చమ్మక్ చల్లో పాటకు వేసిన స్టెప్పులకు నెటిజనులు ఫిదా అవుతున్నారు. ఈ పాట కోసం ఆయన తన భార్యతో కలసి భారతీయ సాంప్రదాయ దుస్తులు ధరించిమరీ స్టెప్పులేయడం ఆకట్టుకుంటోంది. రికీ పాండ్ కాషాయం, తెలుపు రంగులతో ఉన్న జుబ్బా,  పైజామా ధరించగా.. ఆయన భార్య ముదురునీలిరంగు కుర్తా, గాగ్రా ధరించారు. భారతీయులకు చేరువయ్యేలా ఈ వీడియోని రూపొందించిన ఆయన తన ఇన్ స్టా అకౌంట్ ద్వారా  షేర్ చేసి చమ్మక్ చల్లో.. 25వ పెళ్లి రోజు శుభాకాంక్షలు అంటూ క్యాప్షన్ ఇచ్చారు. షారుక్ పాటకు అమెరికన్ జంట స్టెప్పుల వీడియోను నెటిజన్లు తెగ షేర్లు చేసేస్తూ.. ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ricky Pond (@ricky.pond)

 

Tagged , Dancing Dad from America, Dancing dad Ricky Pond, American veteran couple dance, American couple dance for bollywood song, Ricky Pond 25th Marriage day, Ricky Pond Celebrations, US Dancing Dad

Latest Videos

Subscribe Now

More News