టీకా వేసుకోని సైనికులకు.. ట్రైనింగ్ లేదు

టీకా వేసుకోని సైనికులకు.. ట్రైనింగ్ లేదు

వాషింగ్టన్: మిలటరీలోని సైనికులందరూ తప్పనిసరిగా కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలని అమెరికా డిఫెన్స్ మినిస్టర్ లాయిడ్ ఆస్టిన్ ఆదేశించారు. మెడికల్, ఇతర కారణాల వల్ల అనుమతి పొందిన వారికి మినహాయింపు ఉంటుందని చెప్పారు. నేషనల్ గార్డ్ మెంబర్లు టీకా వేస్కోపోతే డ్రిల్స్, ట్రైనింగ్ క్యాంపులకు రానివ్వబోమని తెలిపారు. దీనికి సంబంధించి గైడ్ లైన్స్ జారీ చేయాలని మిలటరీ సర్వీసెస్ హెడ్స్ ను ఆదేశించారు. డ్రిల్స్, ట్రైనింగ్ క్యాంపులకు హాజరు కాకపోతే నేషనల్ గార్డ్ మెంబర్లు రిటైర్ మెంట్ బెనిఫిట్స్ కోల్పోతారు.