మీపై చైనా దాడి చేస్తే.. రష్యా ఆదుకుంటదా?

మీపై చైనా దాడి చేస్తే.. రష్యా ఆదుకుంటదా?
  • ఇండియాకు అమెరికా హెచ్చరిక

న్యూఢిల్లీ: రష్యా, ఉక్రెయిన్ వార్పై భారత్ అనుసరిస్తున్న తీరు మీద అగ్రరాజ్యం అమెరికా మరోమారు అసంతృప్తిని వ్యక్తం చేసింది. యుద్ధాన్ని ఖండించకపోవడాన్ని, పుతిన్ ను విమర్శించకపోవడాన్ని బైడెన్ యంత్రాంగంలోని సీనియర్ అధికారులు తప్పుబడుతున్నారు. రష్యా విదేశీ వ్యవహారాల మంత్రి సెర్గీ లవ్రోవ్ గురువారం ఢిల్లీలో అడుగుపెట్టిన వేళ.. అమెరికా భారత్ కు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేసింది. ఈ విషయంపై అమెరికా జాతీయ భద్రతా సలహాదారుడు దలీప్ సింగ్ కొందరు విలేకరులతో మాట్లాడుతూ.. ఉక్రెయిన్ సంక్షోభంలో భారత్ పోషించిన పాత్రను తప్పుబట్టారు. వార్ జోరుగా సాగుతున్న టైమ్ లో రష్యా నుంచి భారత్ చౌకగా చమురును దిగుమతి చేసుకోవడంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. 

భారత్ లావాదేవీల కారణంగా రష్యా కరెన్సీ రూబుల్ బలపడటాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని దలీప్ సింగ్ స్పష్టం చేశారు. తమ ఆంక్షలను నిర్వీర్యం చేసేలా ఏ దేశం వ్యవహరించినా, కఠిన చర్యలు తప్పవన్నారు. భవిష్యత్తులో చైనాకు జూనియర్ భాగస్వామిగా చైనా తయారయ్యే ప్రమాదం ఉందన్న దలీప్ సింగ్.. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ను డ్రాగన్ ఉల్లంఘిస్తే భారత్ ను ఎవరు ఆదుకుంటారనే ప్రశ్నను సంధించారు. రష్యా ఇండియాకు సాయంగా వస్తుందా అని క్వశ్చన్ చేశారు. రష్యాపై చైనా పట్టు సాధిస్తే.. అది భారత్ కు మరింత నష్టమని పేర్కొన్నారు. కాగా, దలీప్ సింగ్ వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. 

మరిన్ని వార్తల కోసం:

టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ శరత్ కన్నుమూత

పరీక్షలను పండుగలా సెలబ్రేట్ చేసుకోవాలె

నిన్న శిలాఫలకమేస్తే.. నేడు కూలగొట్టిన్రు