ఇక గాల్లో ట్రాఫిక్ : ఎగిరే కార్లకు అమెరికా గ్రీన్ సిగ్నల్..

ఇక గాల్లో ట్రాఫిక్ : ఎగిరే కార్లకు అమెరికా గ్రీన్ సిగ్నల్..

కాలిఫోర్నియాకు చెందిన అలెఫ్ ఏరోనాటిక్స్ తన ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్, ల్యాండింగ్ (eVTOL) వెహికిల్, మోడల్ A ఫ్లయింగ్ కారు, ఆకాశానికి ఎగిరేందుకు US ప్రభుత్వం నుంచి చట్టపరమైన ఆమోదం పొందినట్లు ప్రకటించింది.

అక్టోబరు 2022లో ఆవిష్కరించబడిన ఈ అలెఫ్ (Alef) మోడల్ A పబ్లిక్ రోడ్లపై నడుస్తుంది. అదనంగా టేకాఫ్, ల్యాండింగ్ సామర్థ్యాలను కలిగి ఉంది. ఇది 200 మైళ్లు (322 కిలోమీటర్లు) డ్రైవింగ్ పరిధిని కలిగి ఉంది. ఇందులో ఒకరు లేదా ఇద్దరు ప్రయాణికులతో ఒకే సారి ఛార్జింగ్‌తో 110 మైళ్లు (177 కిలోమీటర్లు) ప్రయాణించగలదు.

ఈ సందర్భంగా అధికారిక ప్రకటన విడుదల చేసిన అలెఫ్... ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) నుంచి ప్రత్యేక ఎయిర్‌వర్థినెస్ సర్టిఫికేషన్‌ను పొందిందని, ఈ తరహా ఎగిరే వాహనం US ప్రభుత్వం నుంచి చట్టపరమైన ఆమోదం పొందడం ఇదే మొదటిసారి అని వెల్లడించింది. మోడల్ A ఫ్లయింగ్ కార్ ధర 3లక్షల డాలర్లు నుంచి (రూ. 2.46 కోట్లు) ప్రారంభమవుతుంది. ఈ ఎలక్ట్రిక్ మోడల్‌ను అలెఫ్ వెబ్‌సైట్ ద్వారా  150 డాలర్లతో (రూ. 12,308) టోకెన్ మొత్తానికి ప్రీ-ఆర్డర్ చేయవచ్చు. మోడల్ A ఉత్పత్తి 2025లో ప్రారంభమవుతుంది.