మిస్సైల్స్ తో మిడిల్ ఈస్ట్ మండుతోంది. దాడులు, ప్రతి దాడులతో మధ్య ప్రాచ్ఛ దేశాలలో బాంబుల మోత మోగుతోంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మొదలైన యుద్ధం .. ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో ఉన్న దాదాపు అన్ని దేశాలు అంటుకునేలా చేసింది. ఇరాన్ అణ్వాయుధాల తయారీని నియంత్రించేందుకు అమెరికా, ఇరాన్ జాయింట్ ఆపరేష్ చేపట్టాయి. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. రెండు దేశాల మిలిటరీ ఫోర్స్ లు ఇరాన్ లో విధ్వంసం సృష్టిస్తున్నాయి. దీంతో ఆ తర్వాత ఇరాన్ కూడా ప్రతిస్పందించింది. యూఎస్ ఆర్మీ బేస్ క్యాంపులే లక్ష్యంగా ఇరాన్ మిస్సైల్స్ ప్రయోగించింది.
ఇరాన్ ప్రభుత్వ, మిలిటరీ సంస్థలే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా మిస్సైల్ దాడులను తీవ్రం చేశాయి. టెహ్రాన్ తో పాటు ఇతర ముఖ్యమైన పట్టణాలపై భారీ మిస్సైల్స్ ప్రయోగిస్తున్నాయి. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో లాంచ్ చేసిన మిలిటరీ దాడులలో ఇరాన్ మిలిటరీ సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలను టార్గెట్ చేశాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ తో పాటు ఇరాన్ ప్రసిడెంట్ లక్ష్యంగా దాడులు తీవ్రతరం చేశాయి.
అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తర్వాత వెంటనే తీవ్రంగా రియాక్ట్ అయిన ఇరాన్.. ఏకంగా ఎనిమిది దేశాలలో ఉన్న యూఎస్ బేస్ క్యాంపులపై దాడులకు దిగింది. అబుదాబీ లోని అల్ ధఫ్రా ఎయిర్ బేస్, బహ్రెయిన్ లోని జుఫైర్ ఏరియా, ఖతార్ లోని అల్ ఉదెయిద్ ఎయిర్ బేస్, కువైట్ లోని అల్ సలేం ఎయిర్ బేస్.. మొదలైన కీలక బేస్ క్యాంపులపై దాడులకు దిగింది ఇరాన్.
దాదులను దృష్టిలో ఉంచుకుని ఇరాన్ సుప్రీం లీడర్ ముందుగానే సురక్షిత ప్రాంతానికి తరలినట్లు చెబుతున్నారు.
అంతకుముందు దాడిని కన్ఫమ్ చేసిన యూఎస్ ప్రసిడెంట్ ట్రంప్.. ఇరాన్ కు అణ్వాయుధాలు లేకుండా చేస్తామని ప్రకటించారు. ఇరాన్ పాలన నుంచి ఉన్న ముప్పును తొలగించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ను పున:ప్రారంభించేందుకు ప్రయత్నిస్తోందని.. అణ్వాయుధాల తయారీ ఆపేస్తానని ఒప్పందం చేసుకోవాలని చెప్పినా ఇరాన్ లెక్క చేయలేదని అన్నారు. దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇరాన్ మిస్సైల్స్, ఆర్మీ క్యాంపులు, మిస్సైల్స్ పరిశ్రమలు మొదలైని అన్నింటిని అమెరికా ఫోర్సెస్ ధ్వంసం చేస్తాయని అన్నారు.
