నెగెటివ్ రిపోర్టు ఉంటేనే రానిస్తం

నెగెటివ్ రిపోర్టు ఉంటేనే రానిస్తం

వాషింగ్టన్: ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నందున అమెరికా కొత్త గైడ్​లైన్స్ తెచ్చింది. దేశంలోకి వచ్చేవాళ్లకు కండిషన్లు పెట్టింది. కరోనా నెగెటివ్ రిపోర్టు ఉంటేనే రానిస్తామని చెప్పింది. లేదా గడిచిన 90 రోజుల్లో కరోనా నుంచి కోలుకున్నట్లు ఎవిడెన్స్ చూపించాలని పేర్కొంది. ఈ ప్రొటోకాల్ సోమవారం నుంచే వర్తిస్తుందని యూఎస్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సెంటర్ పేర్కొంది. రెండేండ్లు ఆపై వయసు వాళ్లందరికీ ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. కరోనా టెస్టు కూడా ఫ్లైట్​ ఎక్కడానికి ఒకరోజు ముందు చేయించుకోవాలన్నారు. కాగా, శనివారం న్యూయార్క్​లో 3 ఒమిక్రాన్ కేసు లు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య ఎనిమిదికి చేరుకోవడంతో అమెరికా అధికారులు విదేశాల నుంచి వచ్చేవాళ్లపై ఆంక్షలు పెట్టారు.