సిరియాలోని ఐఎస్ స్థావరాలపై అమెరికా దాడులు..ఆపరేషన్ హాక్ ఐ స్ట్రైక్ పేరుతో బాంబుల వర్షం

సిరియాలోని ఐఎస్ స్థావరాలపై అమెరికా దాడులు..ఆపరేషన్ హాక్ ఐ స్ట్రైక్ పేరుతో బాంబుల వర్షం
  • దాదాపు 70 ప్రాంతాల్లో ఎయిర్​స్ట్రైక్స్
  • డిసెంబర్ 13న అమెరికా దళాలపై ఐఎస్ ఎటాక్​
  • అందుకు ప్రతీకారంగానే దాడులు చేశామన్న అమెరికా

డమాస్కస్/ వాషింగ్టన్: సిరియాలోని ఐఎస్ ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా అమెరికా మళ్లీ దాడులు చేసింది. వివిధ ప్రాంతాల్లోని ఐఎస్ క్యాంప్‌‌లు టార్గెట్‌‌గా శనివారం ఎయిర్‌‌‌‌ స్ట్రైక్స్ చేసింది. భాగస్వామ్య దేశాల బలగాల సహకారంతో ఈ ఆపరేషన్ చేపట్టింది. అయితే ఇందులో ఏయే దేశాల బలగాలు పాల్గొన్నాయనేది మాత్రం వెల్లడించలేదు. డిసెంబర్‌‌‌‌లో ఐఎస్ చేసిన దాడికి ప్రతీకారంగానే అమెరికా వైమానిక దాడులు చేసింది. శనివారం మధ్యాహ్నం 12:30 గంటలకు (యూఎస్ టైమ్) ఐసిస్ స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. ‘‘మీరు మాకు హాని చేస్తే విడిచిపెట్టం. మీరు ఈ ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా కనిపెట్టి చంపేస్తాం” అని ఐసిస్ ఉగ్రవాదులను యూఎస్ సెంట్రల్ కమాండ్ హెచ్చరించింది. కాగా, పోయినేడాది డిసెంబర్ 13న సిరియాలోని పాల్మైరా ఏరియాలో అమెరికా, సిరియన్ బలగాలపై ఐఎస్ అటాక్ చేసింది. వీరి మృతికి ప్రతీకారంగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఆదేశాల మేరకు యూఎస్ మిలిటరీ ‘ఆపరేషన్ హాక్ ఐ స్ట్రైక్’ పేరుతో ఐఎస్ స్థావరాలపై వరుసగా ఏరియల్ అటాక్స్ చేస్తోంది. అదే నెల 19న సిరియాలోని ఐఎస్ స్థావరాలపై అమెరికా అటాక్ చేసింది. దాదాపు 70 ప్రాంతాల్లో దాడులు చేసింది. మళ్లీ ఇప్పుడు దేశ అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలతో మరోసారి వైమానిక దాడులు చేసింది.