అలా అన్నాడా..నేను పొరబడ్డానా ? మెద్వదేవ్ కామెంట్లపై ట్రంప్ ఫైర్

అలా అన్నాడా..నేను పొరబడ్డానా ? మెద్వదేవ్ కామెంట్లపై ట్రంప్ ఫైర్

వాషింగ్టన్: ఇరాన్‌కు అణ్వాయుధాలు సప్లయ్ చేయడానికి తమతోపాటు చాలా దేశాలు రెడీగా ఉన్నాయని రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వదేవ్ చేసిన కామెంట్లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఈమేరకు తన తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో ఓ పోస్టు పెడుతూ.. "ఇరాన్‌కు అణ్వాయుధాలను సరఫరా చేస్తామని మెద్వదేవ్  చెప్పడం నేను విన్నాను? అతను నిజంగా అలా అన్నాడా? లేదా అదంతా నా ఊహ మాత్రమేనా?" అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒకవేళ మెద్వదేవ్ నిజాంగానే అలా అని ఉంటే.. దయచేసి వెంటనే నాకు తెలియజేయండని కోరారు. మెద్వదేవ్  సూచించిన‘ఎన్ వర్డ్ (న్యూక్లియర్!)’ను అంత తేలికగా పరిగణించకూడదని ట్రంప్ తెలిపారు. ‘ఎన్’ అనే పదాన్ని ఇంత సాధారణంగా వాడకూడదని.. అందుకే పుతిన్ ‘బాస్’ అని పోస్ట్ లో పేర్కొన్నారు.