కరోనాతో తలెత్తిన పరిస్థితులను ఎదుర్కొనేందుకు అమెరికా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంది. పౌరుల ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు వారి ఆర్కథి పరిస్థి తిని మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఈ విపత్కర పరిస్థితుల్లో పౌరుల సంక్షేమానికి ప్రభుత్వం పలు పథకాలను అమలుచేస్తోంది. కరోనా రిలీఫ్ ప్యాకేజీ కోసం ఇప్పటికే ‘కేర్స్’ యూనిట్స్ తీసుకొచ్చి, 2.2 ట్రిలియన్ డాలర్లను ప్రకటించింది. సోషల్ సెక్యూరిటీ స్కీం ఇప్పటికే అమలులో ఉండగా.. ఉద్యోగం కోల్పోయిన వారికోసం ప్రత్యేక పథకాన్ని అమలుచేస్తోంది. తీవ్రంగా దెబ్బతిన్నకార్పొరేషన్లకు ఫండింగ్ చేస్తామని ట్రంప్ చెప్పారు.
ఎకనామిక్ ఇంపాక్ట్ పేమెంట్
కరోనా వల్లతీవ్రంగా నష్టపోయిన వర్గాలకు అందించే సాయాన్ని అమెరికా సర్కారు విడుదల చేసింది.. తొలి దశలో భాగంగా అర్హులైన కొంతమంది అమెరికన్ల ఖాతాల్లో నేరుగా 1200 డాలర్లుజమ చేసినట్లు ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్(ఐఆర్ఎస్) ట్వీట్ చేసింది. దశల వారీగా నగదు డిపాజిట్ చేయనున్నట్లు తెలిపింది. శనివారం ప్రారంభమైన ఈ ప్రక్రియలో భాగంగా టాక్స్పేయర్లలో అర్హులైన వారికి ‘వన్టైం పేమెంట్’ కింద చెక్కులు డిపాజిట్ చేస్తోంది. టాక్స్ పేయర్లను వివిధ కేటగిరీలుగా విభజించి గరిష్టంగా 1200 డాలర్లు(ఒక్కరికి), జంటకు 2400 డాలర్లు, పిల్లల(ఒక్కొక్కరికి) 500 డాలర్ల చొప్పున ఖాతాల్లో డిపాజిట్ చేయనుంది. నలుగురున్న కుటుంబం గరిష్టంగా 3,400 డాలర్ల వరకు అందనుంది.
23 వేలు దాటిన మరణాలు
అమెరికాలో కరోనా కేసుల సంఖ్య మంగళవారం 5.87 లక్షలు దాటింది. 23,654 మంది మరణిం చారు. ఇటలీలో 1.59 లక్షల కేసులు, 20,465 మరణాలు సంభవించాయి. స్పెయిన్ లో మంగళవారం 567 మంది కరోనాతో చనిపోయారు. సోమవారం ఇక్కడ లాక్ డౌన్ సడలించారు. ఇరాన్ లో మంగళవారం 98 మంది చనిపోయారు.
హెచ్–1బి వీసా హోల్డర్లకు గుడ్ న్యూస్
హెచ్–1బి సహా ఇతర నాన్ ఇమిగ్రెంట్ వీసాల కాలపరిమితి పెంచాలని నిర్ణయించింది. వీసా గడువు ముగిసిన వారు ఎక్స్టెన్ష న్ ఫర్ వీసా లేదా చేంజ్ఆఫ్ స్టేట్ కు దరఖాస్తుచేసుకుంటే మరో 8 నెలలు అమెరికాలో ఉండవచ్చని పేర్కొంది.
ఈ బిల్లు లో…
ఉద్యోగులకు సిక్ లీవ్.. చాలామంది ఉద్యోగులకు పెయిడ్ సిక్ లీవ్ ఆప్షన్ లేదు. ఇలాంటి ఉద్యోగులకు 14 రోజుల పెయిడ్ లీవ్ ను ఈ బిల్లు కల్పిస్తుంది. ఉద్యోగంలో నుంచి తీసేసినా 14 రోజులకు పేమెంట్ చేయాల్సిందే. అయితే, 50 మంది, అంతకన్నా తక్కువ ఉద్యోగులు ఉన్న సంస్థలకు ఈ రూల్ వర్తించదు. 500 కంటే ఎక్కువ ఉద్యోగులున్న కంపెనీలు లేబర్ పాలసీలకు అనుగుణంగా నడుచుకోవాలి.
పెయిడ్ ఫ్యామిలీ లీవ్
ఇంట్లో చిన్నారులు ఉన్న వర్కర్లకు 12 వారాల పెయిడ్ ఫ్యామిలీ లీవ్ అవకాశం కల్పించింది. దీని కింద గతంలో వర్కర్ల సంపాదనలో మూడింట రెండొంతులు(రోజుకు 200 డాలర్లుమించకుండా) పొందవచ్చు. సెల్ఫ్ ఎంప్లాయిడ్, టెంపరరీ కాంట్రాక్ట్ వర్కర్లకు ఫెడరల్ టాక్స్ క్రెడిట్ ద్వారా సాయం అందే ఏర్పాట్లు. పబ్లిక్ స్కూళ్లు మూతపడడం వల్ల లంచ్ కోసం కేటాయించిన నిధులను పిల్లకు ఆహారం అందించేందుకు మళ్లిస్తా రు.
పరిశీలనలో ఇంకొన్నిప్రతిపాదనలు
ఎకనామిక్ సపోర్ట్మెజర్స్ కోసం 750 బిలియన్ డాలర్లప్యాకేజీకి ప్రతిపాదనలు చిన్న వ్యాపార సంస్థలకు బ్యాంకుల నుంచి ఆర్థిక సాయం.. మళ్లీ చెల్లించే అవసరంలేకుండా నగదు ట్రాన్స్ఫర్ ఏవియేషన్ ఇండస్ట్రీకి బెయిల్ అవుట్ ప్యాకేజీ.. ట్రావెల్, హాస్పిటాలిటీ కంపెనీలను ఆదుకునేందుకు చర్యలు హెల్త్ కేర్ ఏజెన్సీలకు ఇప్పటికే కేటాయించిన 8.3 బిలియన్ డాలర్ల ప్యాకేజీకి అదనంగా కేటాయింపులు.
