ఉక్రెయిన్ ప్రజలకు అండగా ఉంటామన్న బైడెన్ 

ఉక్రెయిన్ ప్రజలకు అండగా ఉంటామన్న బైడెన్ 

రష్యా విమానాలపై నిషేధం విధించినట్లు ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత తొలిసారి జాతినుద్దేశించి ప్రసంగించారు బైడెన్. ఉక్రెయిన్ ప్రజలకు అమెరికా అండగా ఉంటుందన్నారు. నాటో భూభాగంలోని ప్రతి అంగుళాన్ని..అమెరికా దాని మిత్రపక్షాలు రక్షించుకుంటాయని స్పష్టం చేశారు. ఎంతో ధైర్యంతో రష్యాపై ఉక్రెయిన్లు పోరాడుతున్నారన్నారు. యుద్ధం వల్ల పుతిన్ ప్రస్తుతం లాభపడవచ్చు..కానీ దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. రష్యన్ ఓలిగార్చ్ ల నేరాలపై ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. ఓలిగార్చ్ ల లగ్జరీ అపార్ట్ మెంట్లు, ప్రైవేటు జెట్ లు స్వాధీనం చేసుకునేందుకు యూరోపియన్ మిత్రదేశాలతో చేతులు కలుపుతున్నామన్నారు బైడెన్. యుద్ధ ట్యాంకులతో  కీవ్ ని పుతిన్ చుట్టుముట్టవచ్చు.. కానీ ఉక్రెయిన్ల మనసులు మాత్రం ఎప్పటికీ గెలుచుకోలేరన్నారు బైడన్. ఉక్రెయిన్ల సంకల్పాన్ని ఎప్పటికీ బలహీనపరచలేరన్నారు. 

మరిన్ని వార్తల కోసం

 

ఉక్రెయిన్ - రష్యా దేశాల మధ్య ముదురుతున్న యుద్ధం

వాక్యూమ్, క్లస్టర్ బాంబులతో రష్యా దాడి