గాజాను మళ్లీ ఆక్రమించడం పెద్ద తప్పే: బైడెన్

గాజాను మళ్లీ ఆక్రమించడం పెద్ద తప్పే: బైడెన్
  • అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

గాజా స్ట్రిప్​ను తిరిగి ఆక్రమించాలని ఇజ్రాయెల్​ భావిస్తే అది పెద్ద తప్పే అవుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కామెంట్ చేశారు. తన దృష్టిలో హమాస్, అది చేసిన పనులు.. పాలస్తీనా ప్రజలందరికీ ప్రాతినిధ్యం వహించవని అన్నారు. 2005లో గాజా నుంచి ఇజ్రాయెల్ బయటకు వచ్చేసింది. ఆ తర్వాత పాలనలో కల్పించుకోలేదు. ఆపై ఏడాది గాజాలో జరిగిన ఎన్నికల్లో హమాస్ గెలిచిందని అమెరికా ప్రెసిడెంట్​ బైడెన్ గుర్తుచేశారు.