అణు యుద్ధంపై ఆందోళన వద్దు

అణు యుద్ధంపై ఆందోళన వద్దు

వాషింగ్టన్: అణు యుద్ధం వస్తదని భయపడొద్దని ప్రజలకు అమెరికా ప్రెసిడెంట్​ జో బైడెన్ సూచించారు. అణ్వాయుధ బలగాలను సిద్ధంగా ఉండాలని రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఆదేశించడంతో అణు యుద్ధంపై భయాందోళనలు మొదలయ్యాయి. అయితే ఆందోళన అక్కర్లేదని బైడెన్ సోమవారం మీడియాకు చెప్పారు. కాగా, అంతకుముందు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకీ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతానికి అణ్వాయుధ అలర్ట్ లెవల్స్ ను మార్చాల్సిన అవసరంలేదని చెప్పారు. ‘‘అమెరికా, రష్యాకు చాలా విషయాల్లో విభేదాలున్నాయి. అణ్వాయుధాలను ఉపయోగిస్తే విధ్వంసకర పరిణామాలు తప్పవని 2 దేశాలు చాలాసార్లు అంగీకరించాయి. అణు యుద్ధంలో గెలుపంటూ ఉండదు.. అది ఎప్పుడూ జరగకూడదని చెప్పాయి” అని పేర్కొన్నారు.