
న్యూయార్క్: భారత్‌పై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్టారిఫ్ బాంబు పేల్చారు. ఇండియా తమకు మిత్ర దేశమని అంటూనే ఇండియా వస్తువులపై 25శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఆగస్టు 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నట్లు చెప్పారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‘ట్రూత్’ వేదికగా ట్రంప్ బుధవారం ఈ ప్రకటన చేశారు.
రష్యా నుంచి భారత్భారీగా రక్షణ ఆయుధాలు, ఇంధనం కొనుగోలు చేస్తున్నదని చెప్పారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో భారత్ నిర్ణయం హేయమైన చర్య అని పేర్కొన్నారు. అందుకే భారత్‌పై టారిఫ్‌లతోపాటు అదనంగా పెనాల్టీ విధిస్తున్నట్టు చెప్పారు.
భారత్ మిత్ర దేశమే కానీ..
భారత్‌తమకు మిత్రదేశమని, అయినప్పటికీ ఆ దేశంతో తక్కువ వ్యాపారమే చేస్తున్నామని ట్రంప్‌వ్యాఖ్యానించారు. ‘‘భారత్ మా మిత్ర దేశమే. కానీ ప్రపంచంలోనే అత్యధిక టారిఫ్‌లు విధిస్తున్న దేశాల్లో ఒకటి. అత్యధిక దిగుమతి టారిఫ్‌లు, కఠినమైన ట్రేడ్ బారియర్లు ఉన్నాయి. అందుకే ఆ దేశంతో పరిమితంగా బిజినెస్ డీల్పెట్టుకున్నాం” అని అన్నారు. భారత్‌తో భారీగా వాణిజ్యలోటు ఉన్నదని మరో పోస్ట్‌లో వెల్లడించారు.
కాగా, ఈ ఏడాది ఏప్రిల్ ప్రారంభంలో భారతీయ వస్తువులపై ట్రంప్ 27% వరకు టారిఫ్‌లను ప్రకటించారు. అయితే, ఆ నిర్ణయాన్ని తర్వాత నిలిపివేశారు. అప్పటినుంచి ఇరు దేశాలు ట్రేడ్డీల్కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాయి. భారత్‌పై 20–25 శాతం సుంకం విధిస్తామంటూ ట్రంప్ పదే పదే చెబుతున్నారు. మంగళవారం కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు కానీ.. ఎలాంటి తేదీలు ప్రకటించలేదు. బుధవారం అకస్మాత్తుగా భారత్దిగుమతులపై టారిఫ్‌లు విధిస్తున్నట్టు వెల్లడించారు.