కెనడాకు పంపిన ఆహ్వానం వెనక్కి.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడి

కెనడాకు పంపిన ఆహ్వానం వెనక్కి.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడి

వాషింగ్టన్: గాజాలో శాంతి స్థాపన కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్  ట్రంప్  ఏర్పాటు చేసిన పీస్ బోర్డులో చేరాలని కెనడాకు పంపిన ఆహ్వానాన్ని అమెరికా వెనక్కి తీసుకుంది. ఈ విషయాన్ని ట్రంప్  తన ట్రూత్ సోషల్ లో వెల్లడించారు. 

‘‘డియర్ కెనడా ప్రధాని కార్నీ.. పీస్ బోర్డులో చేరాలని మీకు ఇంతకుముందు పంపిన ఆహ్వానాన్ని మేము వెనక్కి తీసుకుంటున్నాం” అని ట్రంప్  ప్రకటించారు. అంతకు ముందు దావోస్​లో తమ వల్లే కెనడా బతుకుతోందని ట్రంప్​ చెప్పారు. దీనికి కెనడా ప్రధాని మార్క్  కార్నీ అక్కడే కౌంటర్  ఇచ్చారు.