ఇండియాలో బిజినెస్ అంత ఈజీ కాదు

ఇండియాలో బిజినెస్ అంత ఈజీ కాదు

అమెరికా విదేశాంగ శాఖ రిపోర్ట్

వాషింగ్టన్ డీసీ: భారత్ లో వ్యాపారం చేయడం అంత సులువు కాదని అగ్రరాజ్యం అమెరికా అంటోంది. విదేశీ కంపెనీలు తమ దేశంలో మరిన్ని  పెట్టుబడులు పెట్టేలా భారత్ ప్రయత్నించాలని యూఎస్ సూచించింది. అందుకోసం అనువైన వాతావరణం, మౌలిక వసతుల ఏర్పాటు చేయడంతో పాటు కొత్త పరిశ్రమల ఏర్పాటు ప్రక్రియను సరళీకరించాలని అమెరికా విదేశాంగ శాఖ ఓ రిపోర్టులో పేర్కొంది. ఇండియాలో పెట్టుబడులకు సంబంధించి రూపొందించిన ‘‘2021 Investment Climate Statements: India’’ రిపోర్టులో యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ పై సూచనలు చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ లో బిజినెస్ చేయడం సవాలుగా మారిందని పేర్కొన్న అమెరికా.. టారిఫ్ లు, ప్రొక్యూర్మెంట్ రూల్స్ విషయంలో మార్పులు చేయాలని పేర్కొంది. ఎన్డీఏ సర్కారు రెండోసారి అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో రెండు కీలక నిర్ణయాలు తీసుకుందని రిపోర్టు వెల్లడించింది. జమ్మూ కశ్మీరుకు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించడంతో పాటు సీఏఏను రద్దు చేసిందని తెలిపింది. కాగా, ఆర్టికల్ 370 రద్దు తమ దేశ అంతర్గత విషయమని పలు అంతర్జాతీయ వేదికల్లో భారత్ స్పష్టం చేయడం గమనార్హం.