మేం.. మీతోనే ఉంటం : ఆంటోనీ బ్లింకెన్

మేం.. మీతోనే ఉంటం :  ఆంటోనీ బ్లింకెన్

అమెరికా ఎప్పటికీ ఇజ్రాయెల్ వెంటే ఉంటుందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ స్పష్టం చేశారు. గురువారం ఆయన ఇజ్రాయెల్ లో పర్యటించారు. టెల్​ అవీవ్​కు సమీపంలోని బెన్ గురియన్ ఇంటర్నేషనల్ ఎయిర్​పోర్ట్​లో దిగిన ఆయనను ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఎలి కోహెన్ రిసీవ్ చేసుకున్నారు. ఎయిర్​పోర్ట్​లోనే కోహెన్​తో పాటు ఆ దేశ సీనియర్ అధికారులతో సమావేశం అయ్యారు.

 హమాస్ టెర్రరిస్టుల దాడిలో చనిపోయిన వారికి నివాళులర్పించారు. హమాస్ వద్ద బందీలుగా ఉన్న అమెరికన్ల పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. తర్వాత టెల్​ అవీవ్​లో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్​పై హమాస్ దాడులను ఖండించారు. ఇజ్రాయెల్ కు మరింత భద్రత కల్పించి సహకారం అందిస్తామని ప్రకటించారు. ‘‘మేం మీతోనే ఉంటాం. టెర్రరిస్ట్​లకు కలిసి బుద్ధి చెబుదాం. ఇజ్రాయెల్​ గడ్డపై ఉండి ఈ హామీ ఇస్తున్నా”అని బెంజమిన్​ నెతన్యాహుకు ఆంటోనీ బ్లింకెన్​ భరోసా ఇచ్చారు.