అమెరికాలో సేమ్ సెక్స్ మ్యారేజ్ బిల్​కు సెనేట్ ఆమోదం

అమెరికాలో సేమ్ సెక్స్ మ్యారేజ్ బిల్​కు సెనేట్ ఆమోదం
  • ప్రెసిడెంట్ బైడెన్ అనుమతి కోసం బిల్లు

వాషింగ్టన్: అమెరికాలో సేమ్ సెక్స్ మ్యారేజ్ బిల్లును సెనేట్ పాస్ చేసింది. దేశవ్యాప్తంగా గే మ్యారేజ్​లను 2015లో అమెరికా సుప్రీంకోర్టు చట్టబద్ధం చేసినప్పటి నుంచి పెండ్లి చేసుకున్న కొన్ని వేలమంది  సేమ్ సెక్స్ జంటలకు ఊరట కల్పిస్తూ ఈ బిల్లుకు సెనేట్ ఆమోదం తెలిపింది. సమాఖ్య చట్టంలో సేమ్ సెక్స్, జాత్యంతర వివాహాలకు రక్షణ లభించేలా చూడడమే  ఈ బిల్లు ఉద్దేశం. మంగళవారం సెనేట్​లో జరిగిన ఓటింగ్ లో 6,136 మంది సెనేటర్లు ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు. ఈ సందర్భంగా సెనేట్ లీడర్ చక్ షుమర్ మాట్లాడుతూ ఎంతో కాలంగా సేమ్ సెక్స్ మ్యారేజ్ బిల్లుకు సుదీర్ఘకాలం తర్వాత ఆమోదం లభించిందన్నారు. సమానత్వానికి ఇది మరో ముందడుగు అని పేర్కొన్నారు.

కాగా, ఈ బిల్లు ఆమోదం కోసం ప్రెసిడెంట్ జో బైడెన్ వద్దకు పంపనున్నారు. ఆయన ఆమోదం తెలిపితే ఇది చట్టరూపం దాల్చుతుంది. ఈ సందర్భంగా బైడెన్ మాట్లాడుతూ బిల్లుపై సరైన సమయంలో సంతకం చేస్తానని అన్నారు. ఉభయ సభలు బిల్లును ఆమోదం తెలపడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ‘‘ఈ బిల్లుతో ఎల్జీబీటీక్యూ యూత్ కూ సమాన అవకాశాలు దక్కుతాయి. వారు సొంత కుటుంబాలు ఏర్పాటు చేసుకోవడానికి ఈ బిల్లు ఉపకరిస్తుంది” అని వ్యాఖ్యానించారు. ఇక సేమ్ సెక్స్ మ్యారేజ్​లను సంరక్షించే బిల్లు పాస్ కావడం డెమోక్రాట్లకు భారీ విజయం చేకూర్చినట్లయింది. మరోవైపు, ఈ బిల్లును రిపబ్లికన్లు వ్యతిరేకిస్తున్నారు. ఆ బిల్లు అనవసరమంటున్నారు. మతపరమైన స్వేచ్ఛ ఈ బిల్లుతో హరించుకుపోతుందని ఆందోళన వ్యక్తంచేశారు.