స్పేస్ స్టేషన్ కు అమెరికా ఆస్ట్రోనాట్స్

స్పేస్ స్టేషన్ కు అమెరికా ఆస్ట్రోనాట్స్

పదేళ్ల తర్వాత తొలి ప్రయోగం
వాషింగ్టన్: దాదాపు ఓ దశాబ్దం తర్వాత అమెరికా తన వ్యోమగాములను ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్) కు పంపనుంది. ఈమేరకు మే 27న స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 అనే రాకెట్ లో ఇద్దరు అమెరికా ఆస్ట్రోనాట్స్ ను ఐఎస్ఎస్ కు పంపనున్నట్లు నాసా ప్రకటించింది. ఈ రాకెట్ వ్యోమగాములను 24 గంటల్లోనే ఐఎస్ ఎస్ మీద దించనుంది. రాబర్ట్ బెన్ కెన్, డగ్లస్ హర్లే అనే ఇద్దరు ఆస్ట్రోనాట్స్ ఫాల్కన్ 9లో ప్రయాణించనున్నారు. ఈ మిషన్ కోసం గత కొన్నేళ్లుగా వీళ్లు ట్రెయినింగ్ తీసుకుంటున్నారు. ఈ మిషన్ విజయవంతమైతే నాసా మరో మైలురాయిని చేరుకుంటుంది. అమెరికా తన ఆస్ట్రోనాట్స్ ను ఐఎస్ఎస్ కు పంపేందుకు ఇన్నాళ్లూ రష్యన్ సొయుజ్ రాకెట్స్ పై ఆధారపడింది. క్రూయిడ్ ఫ్లైట్స్ కోసం రష్యా మీద డిపెండ్ కావొద్దనే ఉద్దేశంతో ఈ మిషన్ ను పక్కాగా ప్లాన్ చేసింది. అందుకోసం ప్రముఖ ఎంటర్ ప్రెన్యూర్ ఎలన్ మస్క్ స్థాపించిన​స్పేస్ ఎక్స్ కంపెనీ రూపొందించిన ఫాల్కన్ 9 అనే రాకెట్ తోపాటు క్రూ డ్రాగన్ అనే స్పేస్ క్రాఫ్ట్ ను ఎంపిక చేసింది. దీంతో అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపిన మొదటి ప్రైవేటు సంస్థగా స్పేస్ ఎక్స్ నిలువనుంది. కాగా, అమెరికా గడ్డ మీద అమెరికా రాకెట్ లో, అమెరికన్ ఆస్ట్రోనాట్స్ ను లాంచ్ చేయనున్నట్లు నాసా అడ్మినిస్ట్రేషన్ హెడ్ జిమ్ బ్రిడెన్ చెప్పారు. కరోనా వ్యాప్తితో పరిస్థితులు కఠినంగా ఉన్నప్పటికీ మే నెలలో మిషన్ ను నిర్వహించాలనే ప్రణాళికకే కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.