వైద్య చరిత్రలో మరో మైలురాయి..తొలిసారి పంది కిడ్నీ మనిషికి పెట్టారు

వైద్య చరిత్రలో మరో మైలురాయి..తొలిసారి పంది కిడ్నీ మనిషికి పెట్టారు

వైద్య చరిత్రలో మరో మైలురాయి..ప్రపంచంలోనే మొట్టమొదటి సారి పంది కిడ్నీని మనిషికి అమర్చారు. అమెరికాలోని మాసాచుసెట్స్ కు చెందిన వ్యక్తి పంది కిడ్నీ మార్పిడిని పొందిన మొదటి వ్యక్తి అయ్యారు. జన్యుపరంగా మార్పు చేసిన పంది కిడ్నీని మనిషికి అమర్చడం ఇదే తొలిసారి. 

బోస్టన్ లోని మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ వైద్యులు మార్చి 16, 2024న ఈ ఘనతను సాధించారు.దాదాపు నాలుగు గంటలపాటు ఆపరేషన్ చేసి విజయవంతంగా పంది కిడ్నీని మనిషికి అమర్చారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మసాచుసెట్స్ లోని వేమౌత్ కు చెందిన రిచర్డ్ స్టేమాన్ అనే వ్యక్తికి పంది కిడ్నీని అమర్చారు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడు..  మరికొద్ది రోజులు డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్లు చెప్పారు.

జంతువుల నుంచి అవయవాల మార్పిడి ద్వారా  రోగులు దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందుతున్నారని లాస్ ఏంజిల్స్ లోని USC ట్రాన్స్ ప్లాంట్ ఇన్ స్టిట్యూట్ లో కిడ్నీ, ప్యాంక్రియాస్ ట్రాన్స్ ప్లాంటేషన్ డైరెక్టర్ డాక్టర్జిమ్ కిమ్ అన్నారు. స్లేమాన్ కు కిడ్నీ సమస్య ఉండటంతో ఏడేళ్ల పాటు డయాలసిస్, ఆ తర్వాత కిడ్నీ మార్పిడి చేశారు కానీ.. ఐదేళ్ల తర్వాత అది ఫెయిల్ అయింది. దీంతో తిరిగి డయాలసిస్ ప్రారంభించారు. 

పందినుంచి సేకరించిన మూత్రపిండాల్లో హానికరమైన జన్యువులును తొలగించి, మనిషికి అమర్చేందుకు అనుకూలంగా మెరుగుపర్చేందుకు కొన్ని మానవ జన్యువులను జోడించడం,పందుల్లో ఉండే మానవులకు సోకే వైరస్ లను తొలగించడం ద్వారా కేంబ్రిడ్జీ, మసాచుసెట్స్ కు చెందిన ఈజెనెసిస్ ఈ స్లేమాన్ కు పంది మూత్రపిండాన్ని అందించారు. మొదట కోతులకు ఈ పంది మూత్ర పిండాలను అమర్చి విజయవంతం అయిన తర్వాత స్లేమాన్ కు అమర్చారు.