భారత్‌‌కు ఏ సాయం చేసేందుకైనా యూఎస్ రెడీ

భారత్‌‌కు ఏ సాయం చేసేందుకైనా యూఎస్ రెడీ

వాషింగ్టన్: కరోనా వల్ల భారత్‌‌లో నెలకొన్న పరిస్థితులపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కష్ట కాలంలో ఇండియాకు కావాల్సిన సాయాన్ని అందజేస్తామని యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్ అన్నారు. ‘కొవిడ్-19 వల్ల భారత ప్రజలు పడుతున్న ఇబ్బందులు హృదయాన్ని కలచివేస్తోంది. భారత ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాం. ఇండియాకు, అక్కడి ప్రజలు, హెల్త్‌‌కేర్ హీరోలకు కావాల్సిన సహకారాన్ని, మద్దతును అందిస్తాం’ అని ఆంటోనీ బ్లింకెన్ ట్వీట్ చేశారు. 

కాగా, ఆస్ట్రాజెకెకా టీకాతోపాటు అవసరమైన మెడికల్ సప్లయ్‌‌ను భారత్‌కు పంపేందుకు బైడెన్ సర్కార్ శనివారం నో చెప్పిన సంగతి తెలిసిందే. అమెరికా పౌరుల అవసరాలే తమకు ముఖ్యమని యూఎస్ స్టేట్ డిపార్ట్‌‌మెంట్‌‌కు చెందిన సీనియర్ అధికారి, అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ చెప్పారు. అమెరికన్ ప్రజలకు వ్యాక్సినేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడమే తమ లక్ష్యమన్నారు. దేశ పౌరులను కాపాడాల్సిన బాధ్యత తమ ప్రభుత్వం మీద ఉందన్నారు. కరోనా మందుల ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని తొలగించబోమని స్పష్టం చేశారు.