
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2.0లో అరాచకాలు కొనసాగుతున్నాయి. ఓ వైపు టారిఫ్ లు ,మరో వైపు విదేశాల ఆంక్షలతో హడలెత్తిస్తున్నారు. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం డొనాల్డ్ ట్రంప్ మరో మరో 36 దేశాలపై ప్రయాణ ఆంక్షలు విధించేందుకు రెడీ అవుతున్నారంట. ఈ విషయాన్ని ట్రంప్ ప్రభుత్వం పరిశీలిస్తోందని విదేశాంగ శాఖకు చెందిన క్లాసిఫైడ్ స్టేట్ డిపార్ట్ మెంట్ తెలిపింది.
ఇప్పటికే పలు దేశాలను రెడ్ లిస్ట్ లో పెట్టిన ట్రంప్ సర్కార్ మళ్లీ కొత్తగా 36 దేశాలపై చర్యలు చేపట్టనుంది. ట్రంప్ బ్యాన్ లిస్టులో పెడుతున్న దేశాల్లో ఎక్కవగా ఆఫ్రికా, కరేబియన్ దేశాలే ఉంటున్నాయి.
సమాచారం ప్రకారం ఈజిప్ట్, ఇథియోపియా, జిబౌటి , నైజీరియాతో సహా ఇరవై ఐదు ఆఫ్రికా దేశాలు ఈ లిస్టులో ఉన్నాయి. ఇక కరేబియా దేశాలైన ఆంటిగ్వా, బార్బుడా, డొమినికా, సెయింట్ కిట్స్, నెవిస్ , సెయింట్ లూసియా కూడా ఉన్నట్లు సమాచారం. ఇవే కాకుండా భూటాన్, సిరియా, టోంగా, వనువాటు వంటి ఇతర దేశాలు కూడా ట్రంప్ బ్యాన్ లిస్టులో ఉన్నట్లు సమాచారం. ఈ దేశాలన్నీ 60 రోజుల్లోగా తగు ప్రమాణాలను చేరుకోకపోతే తక్షణమే 36 దేశాలపై ఆంక్షలు విధించే అవకాశం ఉంది. మొదటి నుంచి ట్రంప్ అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ముందుకెళ్తున్న సంగతి తెలిసిందే..
36 దేశాలివే..
- అంగోలా
- బెనిన్
- బుర్కినా ఫాసో
- కామెరూన్
- కోట్ డి'ఐవోయిర్
- కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్
- జిబౌటి
- ఈజిప్టు
- ఇథియోపియా
- గబాన్
- గాంబియా
- ఘనా
- లైబీరియా
- మలావి
- మౌరిటానియా
- నైజర్
- నైజీరియా
- సెనెగల్
- దక్షిణ సూడాన్
- సూడాన్
- సిరియా
- టాంజానియా
- ఉగాండా
- జాంబియా
- జింబాబ్వే
ఆసియా & పసిఫిక్
- భూటాన్
- కంబోడియా
- కిర్గిజ్స్తాన్
- టోంగా
- తువాలు
- వనువాటు
కరేబియన్ దేశాలు
- ఆంటిగ్వా , బార్బుడా
- కాబో వెర్డే
- డొమినికా
- సెయింట్ కిట్స్ , నెవిస్
- సెయింట్ లూసియా
- సావో టోమ్, ప్రిన్సిపీ