హెచ్1బీ వీసాలకు వ్యక్తిగత ఇంటర్వ్యూలు రద్దు

హెచ్1బీ వీసాలకు వ్యక్తిగత ఇంటర్వ్యూలు రద్దు

వాషింగ్టన్: కరోనా కేసులు పెరుగుతుండటంతో 2022లో హెచ్1బీ ఇతర వీసాలకు అప్లై చేసుకునేటోళ్లకు ఇన్ పర్సన్ ఇంటర్వ్యూలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఈ నిర్ణయంతో హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌1బీ ఉద్యోగులు, స్టూడెంట్లకు ముఖ్యంగా మనదేశంలోని వేలాది మందికి లబ్ధి కలగనుంది. స్పెషల్ ఆక్యుపేషన్స్ లో ఉన్న వ్యక్తులు (హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌1బీ వీసాలు), ట్రైనీ లేదా స్పెషల్ ఎడ్యుకేషన్ విజిటర్స్ (హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌3 వీసాలు), ఇంట్రా కంపెనీ ట్రాన్స్ ఫరీస్ (ఎల్ వీసాలు), ఎక్స్ టార్డినరీ ఎబిలిటీ ఉన్న వ్యక్తులు (ఓ వీసాలు), అథ్లెట్లు, కళాకారులు, ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్లు (పీ వీసాలు), ఇంటర్నేషనల్ కల్చరల్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చేంజ్ ప్రోగ్రామ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పాల్గొనే వాళ్ల (క్యూ వీసాలు)కు ఇంటర్వ్యూలను రద్దు చేసేందుకు కాన్సులర్ అధికారులకు 2022 డిసెంబర్ 31 వరకు అధికారం ఇస్తున్నట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది. అలాగే టెంపరరీ అగ్రికల్చరల్, నాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అగ్రికల్చరల్ వర్కర్స్ (హెచ్2 వీసాలు), స్టూడెంట్లు (ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎం వీసాలు), స్టూడెంట్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చేంజ్ విజిటర్ల (అకడమిక్ జే వీసాలు)కు ఇంటర్వ్యూలను రద్దు చేసేందుకు కాన్సులర్ ఆఫీసర్లకు ఉన్న అధికారాన్ని తాత్కాలికంగా 2022 డిసెంబర్ 31 వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది.