ఏదైనా హాలీవుడ్ యాక్షన్ సినిమాలో చూసే హై-వోల్టేజ్ 'ప్లేన్ స్విచ్'సీన్ నిజంగా జరిగితే ఎలా ఉంటుంది? సరిగ్గా అచ్చం ఇలాగే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విషయంలో జరిగింది. 2026 జులై 8న టర్కీలో జరిగిన నాటో (NATO) సమిట్ ముగిసిన తర్వాత అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అమెరికాకు తిరుగు పయనం కావాల్సి ఉంది. కానీ సరిగ్గా ఇదే సమయంలో ఒక అల్ట్రా-సీక్రెట్ ఆపరేషన్ జరిగింది. ప్రపంచంలోనే అత్యంత రక్షణ ఉండే అమెరికా ప్రెసిడెంట్, ఒక సాధారణ కేటరింగ్ వ్యాన్ సహాయంతో అందరి కళ్లలో దుమ్ముకొట్టి సీక్రెట్‌గా ఎస్కేప్ అయ్యారు.
మైండ్ బ్లోయింగ్ ఆపరేషన్...
టర్కీ విమానాశ్రయంలో ఇరాన్ నుంచి ట్రంప్‌కు తీవ్రమైన ప్రాణహాని ఉందన్న పక్కా ఇంటెలిజెన్స్ సమాచారంతో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు, అమెరికా మిలిటరీ అప్రమత్తమయ్యాయి. దీంతో ట్రంప్ అమెరికా పర్యటనకు సంబంధించిన ప్లాన్ మొత్తాన్ని సెకర్ల వ్యవధిలోనే మార్చేశారు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు. ట్రంప్ సాధారణంగా ప్రయాణించే పెద్ద ప్రెసిడెన్షియల్ విమానం వద్దకు ఒక ఫుడ్ కేటరింగ్ ట్రక్‌ను తీసుకొచ్చారు. దాని కంటైనర్‌ను విమానం డోర్ స్థాయికి లేపి, మీడియా కెమెరాలు, ఇతరుల కంటపడకుండా ట్రంప్‌ను గుట్టుచప్పుడు కాకుండా కిందకు దించారు. ఆ వ్యాన్ నేరుగా రన్‌వే దాటుకుని వెళ్లి, పక్కనే సిద్ధంగా ఉన్న చిన్న C-32A మిలిటరీ జెట్‌లోకి ట్రంప్‌ను ఎక్కించేసింది. సీక్రెట్‌గా ఆ చిన్న జెట్ ఎక్కి వాషింగ్టన్ ఎగిరిపోయారు
షాకింగ్ ట్విస్ట్..
ఇక్కడ అసలైన క్రేజీ ట్విస్ట్ ఏంటంటే.. వైట్ హౌస్ ప్రెస్ పూల్‌కు చెందిన రాయిటర్స్ రిపోర్టర్ గ్రామ్ స్లాటరీ, ఏపీ ఫోటోగ్రాఫర్ అలెక్స్ బ్రాండన్ మాత్రమే కాదు.., విదేశాంగ శాఖ ప్రముఖులు మార్కో రూబియో వంటి టాప్ వైట్ హౌస్ అధికారులు కూడా ట్రంప్ ఆ పెద్ద విమానంలోనే ఉన్నారని నమ్మారు. కానీ ఆ పెద్ద విమానం కేవలం శత్రువుల దృష్టి మళ్లించడానికి వాడిన ఒక 'డికాయ్' ఫ్లైట్ మాత్రమే. ప్రెసిడెంట్ లేని విమానంలోనే వీరంతా ప్రయాణించారు.
నెట్‌ఫ్లిక్స్ లో 'ది డికాయ్ ప్లేన్'లో ..
హాలీవుడ్ యాక్షన్ సినిమాకి ఏమాత్రం తీసిపోని ఈ రియల్ ఎస్కేప్ డ్రామాపై నెట్‌ఫ్లిక్స్ కన్ను పడింది. ఈ ఊహకందని డ్రామా ఆధారంగా 'Instadocs: The Decoy Plane' పేరుతో ఓ మైండ్-బోగ్లింగ్ డాక్యుమెంటరీని రెడీ చేసింది. ఇందులో మాజీ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ రాబర్ట్ మెక్‌డొనాల్డ్, ఎయిర్ ఫోర్స్ వన్ మాజీ క్రూ మెంబర్ వాండా జోయెల్ , బురిడీ కొట్టిన విలేకరులు ఆ రోజుటి భయానక, తీవ్ర ఉత్కంఠభరిత అనుభవాలనుపంచుకున్నారు.
వాషింగ్టన్ పోస్ట్ రిపోర్టర్ డాన్ లామోత్, కరోల్ లేనిగ్ వంటి దిగ్గజ జర్నలిస్టులు ఈ సీక్రెట్ ఆపరేషన్ వెనుక ఉన్న రహస్యాలను బయటపెట్టనున్నారు. ఒక్క కేటరింగ్ వ్యాన్ తో ఏకంగా అమెరికా అధ్యక్షుడినే మార్చేసి, ప్రపంచాన్ని షాక్‌కి గురిచేసిన ఈ రియల్ లైఫ్ థ్రిల్లర్ సెప్టెంబర్ 4న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. మిలట్రీ ప్లానింగ్, ఏవియేషన్ సైకాలజీ, సీక్రెట్ రూట్స్ కలగలిపిన ఈ 'ఇన్స్టాది డికాయ్ ప్లేన్' థ్రిల్లర్ కోసం ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..
