నిరసనలకు పిలుపు: సెప్టెంబర్ 1 పింఛన్ విద్రోహదినం

నిరసనలకు పిలుపు: సెప్టెంబర్ 1 పింఛన్ విద్రోహదినం

సెప్టెంబర్ 1న: యూఎస్‌‌‌‌పీసీ

అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలకు పిలుపు

హైదరాబాద్, వెలుగు: సీపీఎస్‌‌‌‌ను రద్దు చేసి, పాత పింఛన్‌‌‌‌ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌‌‌‌ చేస్తూ సెప్టెంబర్‌‌‌‌ 1న పింఛన్‌‌‌‌ విద్రోహదినంగా పాటించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్‌‌‌‌పీసీ) టీచర్లకు పిలుపునిచ్చింది. అదే రోజున అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని కోరింది. గురువారం హైదరాబాద్ లో జరిగిన యూఎస్‌‌‌‌పీసీ రాష్ట్ర కమిటీ సమావేశంలో నేతలు సీహెచ్‌‌‌‌ రాములు, రవి(యూటీఎఫ్‌‌‌‌), అశోక్‌‌‌‌కుమార్‌‌‌‌(టీపీటీఎఫ్‌‌‌‌), రఘుశంకర్‌‌‌‌రెడ్డి(డీటీఎఫ్‌‌‌‌) మాట్లాడారు. రాష్ట్రంలో 1.49 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయుల సామాజిక భద్రతకు శాపంగా మారిన సీపీఎస్‌‌‌‌ను రద్దు చేయాలని వారు కోరారు. సీఎం ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్‌‌‌‌ చేశారు.