
‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతోన్న మరో చిత్రం ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. ఇటీవల రామానాయుడు స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ మూవీ.. రెగ్యులర్ షూటింగ్‌కి రెడీ అవుతోంది. దీనికోసం హైదరాబాద్‌లో ఓ స్పెషల్ సెట్ సిద్ధం చేసే పనిలో ఉన్నారు మేకర్స్. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి సెట్ వర్క్ చేస్తుండగా, శుక్రవారం లొకేషన్ స్టిల్స్‌ని షేర్ చేశారు. ఈ నెలాఖరు, లేదా వచ్చే నెల స్టార్టింగ్‌లో పవన్ ఈ సెట్‌లోకి అడుగుపెట్టనున్నారు. ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అనే ట్యాగ్‌లైన్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు హరీష్ శంకర్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తిచేసి, వచ్చే ఏడాది సంక్రాతికి కానీ, సమ్మర్‌లో కానీ రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ తీస్తున్న ‘హరిహర వీరమల్లు’తో పాటు సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న వినోదయ సిత్తం రీమేక్ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. అలాగే సుజిత్ దర్శకత్వంలోనూ పవన్ నటించాల్సి ఉంది.