కాంగ్రెస్ ను గెలిపించండి…TRS కు బుద్ధి చెప్పండి

కాంగ్రెస్ ను గెలిపించండి…TRS కు బుద్ధి చెప్పండి

రాష్ట్రంలో త్వరలో జరగనున్నమున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను కార్యకర్తలు గెలిపించాలని ప్రజను కోరారు TPCC చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. తన ఫేస్ బుక్ లైవ్ లో మాట్లాడిన ఉత్తమ్..TRS పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీ డబ్బులు పంచి గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. మున్సిపాలిటీల్లో TRS పార్టీ 6 ఏళ్లలో చేసిందేమీ లేదన్నారు. కనీస వసతులు కూడా కల్పించలేని TRS కు ప్రజలు ఎందుకు ఓట్లేయాలని ప్రశ్నించారు.

నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, రైతు రుణమాఫీ చేయలేదు. అంతేకాదు రైతు బంధు పథకం అమలు కావడం లేదు, SCలకు మూడు ఎకరాలు ఇవ్వలేదన్నారు ఉత్తమ్. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చని టీఆర్ఎస్ ప్రభుత్వానికి…మున్సిపల్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలన్నారు.

మరోవైపు ఎంఐఎం అధినేత అసదుద్ధీన్ ఓవైసీ..బీజేపీ కి మద్దతు పలికిన TRS తో ఎందుకు కలిసి పోతున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఉత్తమ్. CAA కు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ తీర్మానం చేయకున్నా అసదుద్ధీన్ ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. ఈ విషయంపై మైనార్టీలు ఆలోచన చేయాలన్నారు.

TRS మున్సిపల్ ఎన్నికల్లో కుట్రపూరితంగా వ్యవహరిస్తోందన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఓటర్ లిస్ట్, రిజర్వేషన్ ప్రకటించకుండా షెడ్యూల్ విడుదల చేశారన్నారు. మా అభ్యంతరాలను ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ పట్టించుకోలేదని తెలిపారు. కుట్రలు ఎదుర్కొని కాంగ్రెస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేస్తారని… ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

బీజేపీని నమ్మెద్దన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి…నోట్ల రద్దు, ట్రిఫుల్ తలాక్, జీఎస్టీ, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి..టీఆర్ఎస్ మద్దతు తెలిపిందన్నారు. TRS కు ఓటేస్తే BJP కి వేసినట్లేనన్నారు.