కాళేశ్వరం కట్టడమే పెద్ద తప్పిదం..రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై భారం: ఉత్తమ్

కాళేశ్వరం కట్టడమే పెద్ద తప్పిదం..రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై భారం: ఉత్తమ్

కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడమే తప్పుడు నిర్ణయమన్నారు ఇరిగేషన్ మినిష్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.  ఇరిగేషన్ పై శ్వేతపత్రం అనంతరం చర్చ సందర్భంగా మాట్లాడారు. మేడిగడ్డ దగ్గర కాపర్ డ్యామ్ సాధ్యం కాదు..  మేడిగడ్డ దగ్గర స్టోరేజ్ చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.   నేషనల్  డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనలు తీసుకుంటామన్నారు ఉత్తమ్.  అన్నారం బ్యారేజీలో కూడా నిన్నటి నుంచి లీకేజ్ జరుగుతోందన్నారు.  చేవేళ్ల  ప్రాణహిత డిజైన్ మార్చడం వల్లే ఈ నష్టం జరుగుతోందన్నారు.  

కాగ్ రిపోర్టును తాము పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు ఉత్తమ్. కాళేశ్వరానికి వాడే  కరెంట్ ..రాష్ట్రం మొత్తం వాడే విద్యుత్ బిల్లే ఎక్కువన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కరెంట్ బిల్లే రూ. 10 వేల 700 కోట్లని చెప్పారు. అఖిలపక్షానికి తాము సిద్దమన్నారు. గ్రావిటీ ద్వారా మాత్రమే ఎక్కువ ప్రయోజనం తక్కువ ఖర్చని చెప్పారు. ప్రాజెక్టుల ఖర్చు,ప్రయోజనంపై చర్చ జరగాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై భారం పడిందన్నారు.