పోలీసులు ప్రభుత్వానికి తొత్తులుగా మారొద్దు

పోలీసులు ప్రభుత్వానికి తొత్తులుగా మారొద్దు

పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్వర్యంలో మంజీరా డ్యాం పరిశీలనకు బయలుదేరిన కాంగ్రెస్ నాయకుల బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ప్రాజక్టుల పరిశీలన‌కు వెళ్తోన్న తమను అడ్టుకోవటాన్ని ఖండిస్తున్నామన్నారు ఉత్త‌మ్. ప్రాజక్టుల పరిశీలన తమ హక్కు అని.. ప్రభుత్వానికి పోలీసుల తొత్తులుగా మారొద్దని సూచించారు. గోదావరి నీటితో సింగూర్, మంజీరా డ్యాంను నింపుతామని కేసీఆర్ మాట తప్పారన్నారు. సొంత జిల్లా ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని ఉత్తమ్ పేర్కొన్నారు.

లాక్ డౌన్ నేపథ్యంలో చిన్నజీయర్ తో కలసి పది వేల మందితో సీఎం కొండపోచమ్మ ప్రాజెక్ట్ ఎలా ప్రారంభిస్తారు? అని ఉత్త‌మ్ ప్ర‌శ్నించారు. కల్వకుంట్ల కుటుంబానికి ప్రత్యేక చట్టాలున్నాయా? అని ప్ర‌శ్నిస్తూ.. డీజీపీ దీనికి సమాధానం చెప్పాలన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు జిల్లాల పర్యటనలకు పోలీసులు ఎలా అనుమతి ఇస్తున్నారని ఉత్తమ్ ప్రశ్నించారు. కల్వకుంట్ల ప్రైవేటు సైన్యంగా పోలీసులు వ్యవహరించొద్దన్నారు. ప్రాజక్టుల పేరుతో లక్షల కోట్లు ప్రజల డబ్బును దోచుకుంటున్నారని.. 80శాతం పూర్తైన SLBC ని ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. గ్రావిటీ ద్వారా నీరొచ్చే ప్రాజక్టులకు రూపాయి పని కూడా చేయటం లేదని విమర్శించారు. నీటి ప్రాజక్టుల గురించి టీఆర్ఎస్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతోందని ఉత్తమ్ మండిప‌డ్డారు.