భారత్ ఎవ్వరినీ వదలదు.. వాళ్లది వాళ్లకు ఇచ్చేస్తుంది: యోగీ

భారత్ ఎవ్వరినీ వదలదు.. వాళ్లది వాళ్లకు ఇచ్చేస్తుంది: యోగీ

ఉత్తర ప్రదేశ్ అయోద్యలో జరుగుతున్న దీపోత్సవ వేడుకలకు హాజరయ్యారు ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి యోగీ ఆదిత్య నాథ్, గవర్నర్ ఆనందీ బేన్ పటేల్. ఈ సందర్భంగా యోగీ మాట్లాడుతూ.. భారత్ ఏ దేశానికీ, ఎవరికీ హాని తలపెట్టదని… ఒకవేల ఏదేశమైనా, సంస్థ అయినా భారతదేశానికి హాని తలపెట్టాలనుకుంటే వదలదని అన్నారు. ప్రస్థుతం భారత్ గంబీరమైన స్థితిలో ఉందని చెప్పారు. ముందుగా.. సీతా సహిత రామ లక్ష్మణుల వేశధారణలో ఉన్న వారిని గౌరవించుకున్నారు యోగీ. దీపోత్సవ వేడుకకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. కళాకారులు పలు దేవతా మూర్తుల వేశాదారణలో కనువిందు చేశారు. భక్తులు భారీగా దీపాలను వెలిగించి దీవాళీని దీపోత్సవాన్ని జరుపుకుంటున్నారు.