రాఖీ పండుగ.. వింత ఆచారం.. రాళ్లతో కొట్టుకుంటారు..

రాఖీ పండుగ.. వింత ఆచారం.. రాళ్లతో కొట్టుకుంటారు..

 శ్రావణ పౌర్ణమి రోజున రాఖీ పండుగ సంబరాలు జరుపుకుంటే భారత దేశంలో ఓ ప్రాంతంలో రాళ్లవర్షం కురిపిస్తారు అక్కడి జనాలు .  ఉత్తరాఖండ్​.. మధ్యప్రదేశ్​ లోని కొన్ని చోట్ల వింతగా రాఖీ... రక్షాబంధన్​ వేడుకలు జరుపుకుంటారు.  రాతి యుద్దం చేస్తూ.. ఐక్యతను చాటుకుంటారు.. రాఖీ పండుగ సందర్భంగా రాళ్ల యుద్దంపై స్పెషల్​ స్టోరి. . . 

భారతదేశంలో విభిన్న సంప్రదాయాలు.. సంస్కృతులు ఉంటాయి.. పండుగలు.. ఆచారాలు.. వారి వారి కుటుంబ పద్దతులు.. ఆచారాలు.. ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకంగా జరుపుకుంటారు.  అయితే ఉత్తరాఖండ్​.. మధ్య ప్రదేశ్​ లో  కొన్ని చోట్ల రాఖీ సంబరాలను వింతగా జరుపుకుంటారు.  

 ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ లోని కొన్ని గ్రామాల్లో రక్షా బంధన్ పండుగ రోజున ‘రాళ్లతో యుద్దం చేస్తారు. ప్రతి సంవత్సరం రాఖీ పండగ రోజున, సోదరుడు సోదరిల ప్రేమతో పాటు, ధైర్యం, సంప్రదాయం, శక్తికి చిహ్నంగా రాళ్ల వర్షం కురిపించుకోవడం కొన్ని గ్రామాల్లో   ఆచారంగా ఉందని అక్కడి సంప్రదాయమని చెబుతుంటారు. 

రక్షా బంధన్ రోజున  ఉత్తరాఖండ్‌లోని చంపావత్ జిల్లాలోని ఖోలి కాండ్ మైదానంలో రక్షా బంధన్ రోజున రాతి యుద్ధం అనే ప్రత్యేకమైన సంప్రదాయాన్ని పాటిస్తారు. రెండు సాంప్రదాయ గ్రామాలు సమూహాలుగా ఏర్పడి.. టైంబాండ్​ పెట్టుకొని ఒకరిపై మరొకరు రాళ్లు  విసురుకుంటారు. ఆ సమయం ముగిసిన తరువాత రెండు గ్రామాల ప్రజలు కలిసి అమ్మవారిని పూజిస్తారు.

 ఈ యుద్ధం శక్తి దేవిని ప్రసన్నం చేసుకోవడానికి, సమాజంలో ధైర్యాన్ని నింపడానికి, ఐక్యతను ప్రదర్శించడానికి చిహ్నంగా నమ్ముతారు. ఈ సంప్రదాయం శతాబ్దాల నాటిదని, ఇప్పుడు ఇది జానపద సాంస్కృతిక పండుగ రూపాన్ని సంతరించుకుందని పెద్దలు నమ్ముతారు.

►ALSO READ | ఆపరేషన్ సింధూర్లో బార్డర్ దాటకముందే..5 పాకిస్తాన్ ఫైటర్ జెట్లను కూల్చేశాం:ఐఏఎఫ్ చీఫ్

ఈ వింత సంప్రదాయం  కొన్ని  నియమాల ప్రకారం కొనసాగుతుంది.  ఈ రాళ్ల యుద్దంలో స్థానిక యువత పాల్గొంటారు.  ఈ కార్యక్రమం నాగ దేవతలకు లేదా శక్తి రూపంలో ఉన్న దేవతకు అంకితం చేస్తారు.

 రక్షా బంధన్ కేవలం సోదరులు, సోదరీమణులకే పరిమితం కాదు. ఇది సమిష్టి రక్షణ, బలం, సంస్కృతికి వ్యక్తీకరణ మార్గం కూడా. అయితే ఈ రాళ్ల దాడి సంప్రదాయాల్లో హింస జరగదు. అయితే ప్రతీకాత్మక ధైర్య సాహసాలను ప్రదర్శన ఉంటుంది. 

దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక కారణాలు ఈ సంప్రదాయం ద్వాపర యుగం నాటిదని.. అర్జునుడు సర్పాల మధ్య జరిగిన యుద్ధానికి ప్రతీక అని.. పురాణ కథలోని యుద్ధాల పునఃరూపకల్పనగా లేదా గ్రామ వివాదాలకు ప్రతీకాత్మక పరిష్కారంగా ఈ రాళ్ళ దాడి నమ్ముతారు.