
ఆపరేషన్ సింధూర్పై భారత వైమానిక దళ(IAF) చీప్ ఎయిర్ మార్షల్ ఏపీసింగ్ కీలక ప్రకటన చేశారు.ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్ వైమానిక దళాన్ని చిత్తు చేశామన్నారు. పాక్ వైమానిక దళానికి చెందిన కనీసం ఐదు జెట్ యుద్ద విమానాలను కూల్చేశామని చెప్పారు.
బెంగళూరులోని ఎయిర్ మార్షల్ కాత్రే వార్షికోత్సంలో మాట్లాడిన ఏపీసింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన కనీసం ఐదు జెట్ విమానాలను ఎస్ -400 వైమానిక రక్షణ వ్యవస్థ కూల్చివేసిందన్నారు. పాకిస్తాన్ యుద్ధ విమానాలను 300 కి.మీ దూరంలో కూల్చివేసినట్లు ఆయన చెప్పారు. జాకోబాబాద్‌లో పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన కొన్ని F-16 యుద్ధ విమానాలను కూడా IAF ధ్వంసం చేసిందని అన్నారు.
మే 8నుంచి 10 వరకు జరిగిన ఆపరేషన్ సింధూర్ లో పాక్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని 11 సైనిక స్థావరాలు, 9 ఉగ్రవాద స్థావరాలు లక్ష్యంగా భారత్ సైన్యం దాడులు జరిపింది.. ఈ దాడుల్లో ఆర్మీ ఖచ్చితమైన లక్ష్యాన్ని సాధించింది. ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆర్మీ చేసిన దాడుల్లో పాకిస్తాన్ కోలుకోలేని దెబ్బ తగిలింది.
ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ కీలక ప్రకటన..
బెంగళూరులో జరిగిన 16వ ఎయిర్ చీఫ్ మార్షల్ ఎల్ఎం కాత్రే మెమోరియల్ లెక్చర్‌లో భారత వైమానిక దళ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ ఆపరేషన్ సింధూర్ గురించి కీలక వివరాలను వెల్లడించారు. ఈ ఆపరేషన్ సందర్భంగా భారత వైమానిక దళం పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన ఆరు విమానాలను కూల్చివేసినట్లు ప్రకటించారు. వీటిలో ఐదు ఫైటర్ జెట్‌లు ఒక ఎయిర్‌బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ (AEW&CS) విమానం ఉన్నాయి.
ఎస్-400 రక్షణ వ్యవస్థ పాత్ర..రష్యా నిర్మిత ఎస్-400 ట్రయంఫ్ యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ మిసైల్ వ్యవస్థ ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ వ్యవస్థ 400 కి.మీ. వరకు లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం కలిగి ఉంది. ఈ ఆపరేషన్‌లో 300 కి.మీ. దూరంలో పాకిస్తాన్ విమానాలను కూల్చివేసినట్లు ఎయిర్ చీఫ్ మార్షల్ సింగ్ వెల్లడించారు.
►ALSO READ | పెరిగిపోతున్న భారత పౌరసత్వం వదులుకుంటున్న వారి సంఖ్య.. 2024లో ఎంతమందంటే..?
జాకోబాబాద్ ,భోలారీ స్థావరాలపై దాడులు: జాకోబాబాద్ వైమానిక స్థావరంలో ఆగి ఉన్న ఎఫ్-16 ఫైటర్ జెట్‌లు ,భోలారీ వైమానిక స్థావరంలో ఒక AEW&CS విమానం నేలపై ధ్వంసం చేశారు. ఈ చర్యలు పాకిస్తాన్ వైమానిక నిఘా ,యుద్ధ సంసిద్ధతను గణనీయంగా దెబ్బతీసింది.
బహవల్పూర్‌లో జెఎమ్ హెచ్‌క్యూ దాడి.. బహవల్పూర్‌లోని జైష్-ఎ-మొహమ్మద్ (JeM) ప్రధాన కార్యాలయంపై దాడి జరిగింది. దాడికి ముందు ,తర్వాత తీసిన చిత్రాలను ఎయిర్ చీఫ్ మార్షల్ సింగ్ ప్రదర్శించారు.ఇవి ఖచ్చితమైన దాడులను,పక్కన ఉన్న భవనాలకు నష్టాన్ని చూపించాయి.
మురిద్కే-ఎల్ఈటీ హెచ్‌క్యూ దాడి: మురిద్కేలోని లష్కర్-ఎ-తొయిబా (LeT) ప్రధాన కార్యాలయంపై కూడా దాడి జరిగింది. ఇక్కడ పాకిస్తాన్ ఉన్నత స్థాయి నాయకత్వ నివాస ప్రాంతాలు ,కార్యాలయ భవనాలు లక్ష్యంగా దాడులు జరిగాయి.
ఎస్-400 వ్యవస్థ ప్రభావం..
ఆపరేషన్ సింధూర్‌లో ఎస్-400 వైమానిక రక్షణ వ్యవస్థ గేమ్-చేంజర్‌గా మారిందన్నారు ఆర్మీ చీఫ్. పాకిస్తాన్ విమానాలను దీర్ఘ-శ్రేణి గ్లైడ్ బాంబులను ఉపయోగించకుండా ఈ వ్యవస్థ నిరోధించిందన్నారు. దీనివల్ల వారు భారత గగనతలంలోకి చొచ్చుకురాకుండా అడ్డుకున్నామని ప్రకటించారు. ఈ వ్యవస్థ సామర్థ్యాన్ని హైలైట్ చేస్తూ ఇది భారత వైమానిక దళానికి వైమానిక ఆధిపత్యాన్ని సాధించడంలో సహాయపడిందని అన్నారు ఎయిర్ చీఫ్ మార్షల్ సింగ్.