ఏప్రిల్ 21 నుండి అన్ని కాలేజీల్లో ఆన్‌లైన్ క్లాసెస్

ఏప్రిల్ 21 నుండి అన్ని కాలేజీల్లో ఆన్‌లైన్ క్లాసెస్

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రధాని నరేంద్ర మోడీ దేశం యావత్తు లాక్డౌన్ ప్రకటించారు. దాంతో ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీలు, కంపెనీలు, ప్రజారవాణా ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. ఏది బందున్నా పర్వాలేదు కానీ.. విద్యాసంస్థలు బంద్ కావడంతో తమ విద్యా సంవత్సరాన్ని ఎక్కడ కోల్పోవాల్సి వస్తుందేమోనని అటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. దాంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు టెన్త్, ఇంటర్ విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు మొదలుపెట్టాయి.

తాజాగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా అటువంటి నిర్ణయమే తీసుకుంది. ఏప్రిల్ 21 నుండి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలలో ఆన్‌లైన్ తరగతులు ప్రారంభించాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం శనివారం ఆదేశాలు జారీ చేసింది. విద్యాశాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ అహ్మద్ ఇక్బాల్ రాసిన లేఖ ప్రకారం.. స్కైప్, గూగుల్ మీట్, మైక్రోసాఫ్ట్ టీమ్స్ మరియు జూమ్ యాప్స్ సహాయంతో ఆన్‌లైన్ తరగతులు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే.. ఈ ఆన్‌లైన్ క్లాసెస్ సెషన్‌ను పూర్తిగా రికార్డ్ చేయాలని అహ్మద్ ఇక్బాల్ సూచించారు.

For More News..

వీడియో వైరల్: ఫోన్ చేస్తే ఇంటికొచ్చి బర్త్ డే చేసిన పోలీసులు