ఈ పోలీసులకు కొమ్ములొచ్చాయా..? : నేరుగా ఆస్పత్రి వార్డులోకి పోలీస్ జీపు

ఈ పోలీసులకు కొమ్ములొచ్చాయా..? : నేరుగా ఆస్పత్రి వార్డులోకి పోలీస్ జీపు

పోలీసులు.. అవును పోలీసులు కొంత స్పెషల్.. ఎందుకంటే శాంతిభద్రతలు కాపాడే వారు.. అలా అని ప్రత్యేకంగా వాళ్లకు రూల్స్ అయితే ఏమీ లేవు కదా.. ఇంకా చెప్పాలంటే ప్రజల కంటే మరింత బాధ్యతాయుతంగా ఉండాలి.. కొందరు పోలీసులు అయితే చట్టం మా చుట్టం అన్నట్లు వ్యవహరిస్తుంటారు.. అలాంటోళ్లు చివరకు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు అనేది కూడా చూస్తున్నాం.. ఇప్పుడు అయితే ఉత్తరాఖండ్ పోలీసులు అయితే దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యారు.

 పోలీస్ జీపును ఏకంగా ఆస్పత్రి వార్డులోకి తీసుకొచ్చారు.. అంబులెన్స్ కూడా ఇప్పటి వరకు ఇలాంటి సాహసం చేయలేదు.. మన పోలీసులు మాత్రం ఏకంగా ఆస్పత్రి లోపల అది కూడా ఆశామాషీ ఆస్పత్రి కాదు ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పెద్ద ఆస్పత్రి అలాంటి దవాఖానలోని వార్డులోని బెడ్ దగ్గరకు పోలీస్ జీపును తీసుకొచ్చారు.. ఇప్పుడు ఇదే దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

దీనిపై స్టేషన్ హెడ్ ఆఫీసర్ శంకర్ సింగ్ స్పందిస్తూ..  తాము తమ డ్యూటీ చేయడానికే అలా వెళ్లామని చెప్పారు. ఆస్పత్రిలో డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్న సతీష్ కుమార్ అనే వ్యక్తిని అరెస్టు చేయడానికే అలా వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. ఎందుకంటే.. సతీష్ కుమార్ ఆస్పత్రిలో డాక్టర్లుగా విధులు నిర్వహిస్తున్న పలువురు అమ్మాయిలకు అసభ్యకరమైన మెసేజ్ లు పంపుతూ వారని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని కంప్లైంట్ వచ్చిందన్నారు. 

వైద్యులు ఆస్పత్రి ఆవరణలో నిరసలు తెలపడంతో   రిషికేశ్ కొత్వాలిలో సతీష్ పై కేసు నమోదైందన్నారు. సతీష్ కుమార్‌ను ఆస్పత్రి యాజమాన్యం మే 21 2024 నాడు సస్పెండ్ చేసిందన్నారు. అయినా ఆస్పత్రి వైద్యులు నిరసనలు తెలుపుతూ అతన్ని ఆస్పత్రి నుంచే తొలగించాలని డిమాండ్ చేశారన్నారు. తాము అక్కడికి వెళ్లినప్పుడు బయట నిరసనలు నడుస్తుండటంతో తాము జీపు వేసుకుని లోపలికి వెళ్లి సతీష్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు శంకర్ సింగ్.  

దీనిపై తమకు ఎటువంటి వ్యక్తి గత ఎజెండా లేదని తెలిపారు. ఈ క్రమంలోనే ఆస్పత్రి లోపలికి వెళ్లి వీడియో క్లిప్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎంత పోలీసులైతే మాత్రం అలా ఆస్పత్రి లోపలికి అది కూడా వార్డు లోపలికి జీపు తీసుకెళ్లొచ్చా అని ప్రశ్నిస్తున్నారు.