కోటి రూపాయల కారు నడుపుతూ కనిపించిన రాందేవ్ బాబా

కోటి రూపాయల కారు నడుపుతూ కనిపించిన రాందేవ్ బాబా

భారతీయ యోగా గురువు బాబా రామ్‌దేవ్ 'ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130' అనే లగ్జరీ ఎస్‌యూవీని నడుపుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తరాఖండ్‌లో ఈ ఏడాది ప్రారంభంలో విడుదల చేసిన మొదటి కారుగా నిలిచిన ఈ కారును పతంజలి గ్రూప్‌లోని సభ్యులలో ఒకరు అతనికి బహుమతిగా ఇచ్చారని చెబుతున్నారు. ఈ వీడియోలో బాబా రామ్‌దేవ్ కారు స్టీరింగ్ వీల్‌ను పట్టుకుని, డ్రైవ్ చేసి.. ఆ తర్వాత కారు నుంచి నెమ్మదిగా దిగడం చూడవచ్చు.

యోగా గురువుగా ప్రసిద్ధి చెంది బాబా రామ్ దేవ్.. హరిద్వార్‌లో ఇలా సరికొత్త కారు నడుపుతూ కనిపించింది. అలాగే, డ్రైవ్ సమయంలో అతనితో పాటు పక్కనే ఓ మహిళ, మరికొంత వ్యక్తులు కూడా ఉన్నట్లు ఈ ఫుటేజ్ లో కనిపిస్తోంది.

ఇది రాష్ట్రంలోని మొదటి కారు అని, ఉత్తర్ ప్రదేశ్ తూర్పు, మధ్య ప్రాంతంలోని పతంజలి గ్రూప్ CFA దివ్యాంశు కేసర్వాణి దీన్ని రామ్ దేవ్ కు బహుమతిగా ఇచ్చినట్టు తెలుస్తోంది. ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130 అనే కారు ఎనిమిది మంది కూర్చోవడానికి అనువుగా దీన్ని తయారు చేశారు. 2023లో మార్కెట్ లోకి వచ్చిన ఈ ఖరీదైన ఆఫ్-రోడర్ ధర రూ.1కోటి 30 లక్షల నుంచి ప్రారంభం కానుంది.

 

 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by AUTO WAAR (@auto.waar)