9వ రోజుకు టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్.. ప్రమాదంలో 40 మంది ప్రాణాలు

9వ రోజుకు టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్.. ప్రమాదంలో 40 మంది ప్రాణాలు

ఉత్తర కాశీలోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న కార్మికుల రెస్క్యూ ఆపరేషన్ గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీతో టెలిఫోనిక్ సంభాషణ నిర్వహించారు. నిర్మాణంలో ఉన్న సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న కార్మికుల కోసం సహాయచర్యలు కొనసాగుతుండగా.. దీనికి సంబంధించిన వివరాలను మోదీ అడిగి తెలుసుకున్నారు.

అవసరమైన రెస్క్యూ పరికరాలు, వనరులను కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తోందని ప్రధాని ఇటీవలే చెప్పారు. శిథిలాలలో చిక్కుకున్న 41 మంది కార్మికులను తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నందున రెస్క్యూ ఆపరేషన్ నేటికి 9వ రోజుకు చేరుకుంది. ఈ ఉదయం సిల్క్యారా సొరంగం వద్ద చిక్కుకుపోయిన బాధితులను బయటకు తీసుకొచ్చేందుకు భారీ యంత్రాలు చేరుకున్నాయి.