అక్కినేని అఖిల్(Akhil akkineni) నటించిన లేటెస్ట్ మూవీ "ఏజెంట్"(Agent) రిలీజై ఇంకా నాలుగు రోజులు కూడా కాలేదు అప్పుడే తన తరువాత సినిమాకి సంబందించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏజెంట్ రిజల్ట్ తో సంబంధం లేకుండా మరో పాన్ ఇండియా మూవీని అఖిల్ తో చేయడానికి సిద్ధమయ్యారు టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్.
ఇంతకీ ఆ మేకర్స్ ఎవరో కాదు.. ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్ట్ లని లైన్లో పెడుతున్న యూవి క్రియేషన్స్(UV Creations). ఈ ప్రాజెక్టు కి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఇప్పటికే మొదలయ్యాయట. ప్రభాస్ హీరోగా వచ్చిన సాహో మూవీకి సుజీత్ దగ్గర అసిస్టెంట్ గా చేసిన.. అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కించనున్నాడు. అనిల్ చెప్పిన స్టోరీ అఖిల్ కి బాగా నచ్చిందట. అందుకే వెంటనే డేట్స్ కూడా అడ్జెస్ట్ చేసాడట.
ఆగస్టు లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా కూడా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుందని టాక్. కెరీర్ స్టార్టింగ్ నుండి ఒక సాలిడ్ కమర్షియల్ హిట్ కోసం చూస్తున్న అఖిల్ కి ఈ సినిమాతోనైనా ఆ కోరిక తీరుతుందా అనేది చూడాలి మరి.